బాలాకోట్ లో మళ్లీ అలజడి.. భారత్‌లో మరోసారి మారణ హోమం సృష్టించేందుకు ప్రయత్నాలు
పాక్ లోని బాలాకోట్ పై భారత వైమానిక దళం సర్జికల్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసి అక్కడి తీవ్రవాదులను తుడిచిపెట్టిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల పాటూ అక్కడి ఉగ్రవాద స్థావరాలు కాస్త సైలెంట్
పాక్ లోని బాలాకోట్ పై భారత వైమానిక దళం సర్జికల్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసి అక్కడి తీవ్రవాదులను తుడిచిపెట్టిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల పాటూ అక్కడి ఉగ్రవాద స్థావరాలు కాస్త సైలెంట్ గా ఉండగా, ఇప్పుడు మళ్లీ మళ్ళీ అలజడి మొదలైంది. బాలాకోట్ లో ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్ తన క్యాంపులను మళ్లీ యాక్టివ్ చేసింది. యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తోందని, భారత్ పై దాడులకు తెగబడేందుకు వీరిని సిద్ధం చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. భారత్ కు, హిందుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నట్టుగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది.
మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఇక్కడి క్యాంపులోనే ఉన్నాడని నిఘా వర్గాలు చెబుతూ ఉన్నాయి. రవూఫ్ ను భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించే ఆపరేషన్లకు ప్రముఖ పాత్ర పోషించేలా మసూద్ అజార్ నియమించాడని సమాచారం. అయితే పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో సూత్రధారి మసూద్ అజార్. ఇప్పుడు భారత్ లో మరోసారి తీవ్ర మారణహోమం సృష్టించాలని జైషే మొహమ్మద్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
వారి ప్రయత్నాలను ముందే పసిగట్టిన నిఘా వర్గాలు అప్రమత్తం చేస్తున్నాయి. ఎలాంటి దాడులు జరగకుండా ముందు నుంచే సమాచారం అందిస్తూ వస్తున్నాయి నిఘా వర్గాలు. ముందస్తు సమాచారంతో భారత దళాలు అప్రమత్తం అవుతున్నాయి.