నీటి తొట్టిలో జలకాలాడుతున్న పులి.. వైరల్ అవుతోన్న వీడియో.. రకరకాల కామెంట్స్‌తో..
తెలంగాణలోని కొముం భీం అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి మనుషులపై దాడి చేస్తుంటే ఢిల్లీలో ఓ పులి టబ్‌లోకి దిగి జలకాలాడుతోంది. ఆశ్చర్యంగా ఉన్నా
తెలంగాణలోని కొముం భీం అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి మనుషులపై దాడి చేస్తుంటే ఢిల్లీలో ఓ పులి టబ్‌లోకి దిగి జలకాలాడుతోంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పులి టబ్‌లో స్నానం చేసే వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వీడియో చూసి వింత వింత కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
కర్ణాటకలోని కొడగులో ఓ ఇంటి యజమాని పశువుల కోసం నీళ్ల టబ్ ఏర్పాటుచేశాడు. అయితే ఆ చుట్టుపక్కల సంచరిస్తున్న పులి అటుగా వచ్చింది. టబ్ చుట్టూ తిరుగుతూ ఎవరైనా ఉన్నారా అని పరిశీలించింది. ఎవరూ లేరని నిర్ణయించుకొని టబ్‌లో దిగి జలకాలాడటం ప్రారంభించింది. అంతేకాకుండా ఎవరైనా వస్తే పారిపోవడానికి సిద్దంగా ముందు కాళ్లను రెడీ గా ఉంచుకొంది. ఈ పులి వీడియోను కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. దీంతో స్పందించిన ఆనంద్ మహీంద్రా కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
What an unusual occurrence. Apparently in Coorg. Received from a friend on WhatsApp. pic.twitter.com/C7yEF6fjAW
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 7, 2020