దేశంలో కొత్తగా 30,254 పాజిటివ్ కేసులు, 391 మరణాలు.. తాజాగా 33,136 మంది డిశ్చార్జ్.. పెరుగుతున్న రికవరీ శాతం
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,254 పాజిటివ్ కేసులు, 391 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు చేరింది.
Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,254 పాజిటివ్ కేసులు, 391 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,56,546 ఉండగా.. ఇప్పటివరకు 93,57,464 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 391 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,43,019 మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన చోట్ల పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 33,136 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 10,14,434 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 15,37,11,833కు చేరింది. దేశంలో 94.93 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 3.62 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది.
Also Read:
‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..
మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..