AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్పత్రిలో ఆడ శిశువును దొంగిలించేందుకు మాస్టర్‌ ప్లాన్‌..! టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన మహిళ

బాగల్‌కోట్ జిల్లా ఆసుపత్రిలో ఒక రోజు వయసున్న ఆడ శిశువును సాక్షి యాదవ్ అనే మహిళ దొంగిలించింది. ఆమె తల్లి, సోదరీమణులు కూడా ఈ దొంగతనంలో పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్యుల అనుమానం మూలంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆస్పత్రిలో ఆడ శిశువును దొంగిలించేందుకు మాస్టర్‌ ప్లాన్‌..! టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన మహిళ
Bagalkot Hospital
SN Pasha
|

Updated on: Jun 14, 2025 | 4:58 PM

Share

బాగల్‌కోట్ జిల్లా ఆసుపత్రిలో ఒక మహిళ ఒక రోజు వయసున్న ఆడ శిశువును దొంగిలించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. జిల్లాలోని రామదుర్గ తాలూకాలోని ఖాన్‌పేట్‌కు చెందిన సాక్షి యాదవ్ శిశువును దొంగిలించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో సాక్షికి ఆమె తల్లి, సోదరీమణులు సహా ముగ్గురు వ్యక్తులు సాయంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి బాగల్‌కోట్ నవనగర్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాక్షి శుక్రవారం సాయంత్రం జిల్లా ఆసుపత్రికి వచ్చి అనుమతి తీసుకోకుండానే ప్రసూతి వార్డులో చేరింది. తనకు కూడా ఒక బిడ్డ పుట్టిందని ఆమె తన పొరుగువారికి చెప్పింది. ఈ రోజు ఉదయం 4.30 గంటలకు, ఆమె వేరొకరి బిడ్డను తీసుకొని తనతో పడుకోబెట్టుకుంది. తాను నర్సునని, కఫం తొలగిస్తానని చెప్పింది. ఆస్పత్రిలో ఎవరికీ అనుమానం రాకుండా కడకోల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాను బిడ్డకు జన్మనిచ్చినట్లు ఒక నకిలీ కార్డు తయారు చేయించకుంది.

అయితే ఆస్పత్రి వైద్యులకు అనుమానం వచ్చి సాక్షిని పరీక్షించగా ఆమెకు ప్రసవం కాలేదని నిర్ధారణ అయింది. తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ శిశువు తన వద్దకు ఎలా వచ్చిందని డివైఎస్పీ మహంతేష్ జిడ్డి వార్డులోని మహిళను ప్రశ్నించారు. ఆ శిశువు తనదేనని ఆ మహిళ వాదించింది. ఈ సంఘటన గురించి జిల్లా ఆసుపత్రి సర్జన్ మహేష్ కోణి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని, ఆసుపత్రిలోని సంబంధిత వార్డులో నిర్లక్ష్యంపై కూడా విచారణ చేస్తామని చెప్పారు. బాగల్‌కోట్ ఎస్పీ అమర్‌నాథ్ రెడ్డి జిల్లా ఆసుపత్రిని సందర్శించి, మీడియాతో మాట్లాడుతూ.. కఫం తొలగించడానికి నర్సు బిడ్డను తీసుకెళ్లిందని అన్నారు. సంఘటన గురించి మేం సమాచారాన్ని సేకరిస్తున్నాం. జిల్లా ఆసుపత్రి సీసీ కెమెరాలను తనిఖీ చేస్తామని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..