AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: ఈ సారి మరింత భయంకరంగా కరోనా..? బాబా వంగా చెప్పినట్టే జరిగి తీరుతుందా..?

బాబా వంగా 2030లో తీవ్రమైన కొత్త వైరస్ వ్యాప్తిని అంచనా వేశారు. ప్రస్తుత కోవిడ్-19 పెరుగుదల ఆమె అంచనాలకు అనుగుణంగా ఉందా అనే చర్చ జరుగుతోంది. 1999లో రియో టాట్సుకి కూడా ఇదే విధమైన అంచనాలను వెల్లడించారు. బాబా వంగా మునుపటి అంచనాలు నిజమైనవి కావడంతో ఈ భవిష్యవాణిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Baba Vanga: ఈ సారి మరింత భయంకరంగా కరోనా..? బాబా వంగా చెప్పినట్టే జరిగి తీరుతుందా..?
Covid 19 And Baba Vanga
SN Pasha
|

Updated on: May 28, 2025 | 12:55 PM

Share

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి బాబా వంగా అంచనాల గురించి చర్చ మొదలైంది. 2030లో కొత్త వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుందని బాబా వంగా అంచనా వేశారు. కానీ, కరోనా వైరస్ అంతకు ముందే వ్యాప్తి చెందుతోంది. భవిష్యత్తు గురించి బాబా వంగా వేసిన పలు అంచనాలు ఇప్పటికే నిజం అయ్యాయి. ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా ఆమె చెప్పిందే జరుగుతుందేమో అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న వయసులోనే చూపు కోల్పోయిన బాబా వంగా భవిష్యత్తు సంఘటనలను కచ్చితంగా అంచనా వేస్తారు. ఆమె చనిపోయే ముందు రాబోయే సంవత్సరాల్లో ఏం జరుగుతుందో పేర్కొన్నారు.

ఇప్పుడు కరోనా గురించి మాట్లాడుకుంటే.. 1999లో జపనీస్ రచయిత రియో ​​టాట్సుకి “ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్” అనే పుస్తకాన్ని రాశారు. అందులో కరోనా గురించి కొన్ని అంచనాలను రాశారు. “ఒక తెలియని వైరస్ ఏప్రిల్ 2020 లో వస్తుంది. అది ఏప్రిల్ లో గరిష్ట స్థాయికి చేరుకుని ఆ తర్వాత అదృశ్యమవుతుంది. ఆ తర్వాత 10 సంవత్సరాలకు 2030 లో వైరస్ మళ్ళీ గరిష్ట స్థాయికి చేరుకొని దాని ఉగ్రరూపం చూపిస్తుందని పేర్కొన్నారు. వైరస్ చాలా తీవ్రమైనది. ఇందులో ఎక్కువ మంది చనిపోతారు. ఇది మరోసారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీస్తుందని ప్రస్తావించారు. 2030కి ఇంకా 4 సంవత్సరాలు దూరంలో ఉన్నందున, వైరస్ ప్రభావం పెరుగుతోందని కూడా ఆయన ఎత్తి చూపారు.

బాబా వంగా ఆశ్చర్యకరమైన అంచనాలు

అంతకుముందు, బాబా వంగా సునామీ గురించి హెచ్చరించారు. 2025 జూలైలో జపాన్, ఫిలిప్పీన్స్‌లను పెను సునామీ తాకుతుందని అంచనా వేశారు. ఇది 2011 విపత్తు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని బాబా వంగా అంచనా వేశారు. జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులు సముద్ర అల్లకల్లోలానికి, భూకంపాలకు గురవుతాయని ఆయన అంచనా వేశారు.

వెయ్యి దాటిన కరోనా కేసులు

భారతదేశంలో ప్రస్తుతం 1009 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో కేరళ, మహారాష్ట్రలలోనే 430 మందికి వైరస్ సోకింది. ఆ తరువాత తమిళనాడులో 69 మంది, కర్ణాటకలో 47 మంది, గుజరాత్‌లో 83 మంది, రాజస్థాన్‌లో 13 మంది, పశ్చిమ బెంగాల్‌లో 12 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైనది కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ చెప్పడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..