AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC 2025 Exam: ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్‌డేట్ మీకోసమే..

వివిధ రైల్వే రీజిన్లలో దాదాపు 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దేశ వ్యాప్తంగా మొత్తం 1.2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష..

RRB NTPC 2025 Exam: ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్‌డేట్ మీకోసమే..
RRB NTPC 2025 Railway Jobs
Srilakshmi C
|

Updated on: May 28, 2025 | 11:10 AM

Share

హైదరాబాద్‌, మే 28: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజిన్లలో దాదాపు 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దేశ వ్యాప్తంగా మొత్తం 1.2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను ఆర్‌ఆర్‌బీ ఇటీవల విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు జూన్‌ 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి.

రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు సంబంధించి స్టేజ్‌ 1 పరీక్షల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష నగరానికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఇక స్టేజ్‌ 1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచనున్నట్లు ఆర్‌ఆర్‌బీ తన ప్రకటనలో తెలిపింది.

ఆర్‌ఆర్‌బీ నాన్‌ టెక్నికల్‌(గ్రాడ్యుయేట్‌) సిటీ ఇంటిమేషన్‌ స్లిప్లుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్‌) స్టేజ్‌ 1 పరీక్షలకు మాక్‌ టెస్టులను ఆర్‌ఆర్‌బీ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను రాసేందుకు అవకాశం కల్పించింది. ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండానే వివిధ పేపర్ల మాక్‌ టెస్టులు నేరుగా వినియోగించుకోవచ్చు. ఈ నమూనా పరీక్ష ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జూన్‌ 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలోని గ్రాడ్యుయేట్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్..
బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్..
పాకిస్తాన్‌లో అమ్మవారి శక్తిపీఠం..ముస్లింలు కూడా వెళ్లేది ఇందుకే!
పాకిస్తాన్‌లో అమ్మవారి శక్తిపీఠం..ముస్లింలు కూడా వెళ్లేది ఇందుకే!
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?