పాన్ షాపులకు అనుమతివ్వండి: నిర్వాహకుల విజ్ఞప్తి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 1.0 అమలవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన కేంద్రం మెల్లమెల్లగా ఆంక్షలు సడలిస్తూ వస్తోంది. ఇప్పటికే అనేక వాటిల్లో కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. చివరకు మద్యం దుకాణాలు కూడా తెరుచుకోవడంతో..తాజాగా పాన్ షాపులకు అనుమతి....

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 1.0 అమలవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన కేంద్రం మెల్లమెల్లగా ఆంక్షలు సడలిస్తూ వస్తోంది. ఇప్పటికే అనేక వాటిల్లో కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. చివరకు మద్యం దుకాణాలు కూడా తెరుచుకోవడంతో..తాజాగా పాన్ షాపులకు అనుమతి కోరుతూ దుకాణదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఔరంగాబాద్ లో పాన్‌షాప్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాన్ షాపులు తెరిచేందుకు అనుమతివ్వాలని కోరుతూ జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించారు. లాక్ డౌన్ కారణంగా తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా తమ షాపులు మూసి ఉంచామని, దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. వీలైనంత త్వరగా పాన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని వారంతా జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఔరంగాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 7,500 పాన్ షాపులు ఉండగా, కేవలం ఔరంగాబాద్ పట్టణంలోనే 3 వేలకు పైగా ఉన్నాయి. ఇక వాటిల్లో పనిచేసే వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది.