జమ్మూ కాశ్మీర్ లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలపై ఉగ్రవాదుల దాడి..
జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో గురువారం బార్డర్ సెక్యూరిటీ దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్మూ నుంచి భద్రతా దళాలు శ్రీనగర్ వెళ్తుండగా జాతీయ రహదారి పై మాల్ పోరా- క్వాజి గండ్ వద్ద ఈ ఘటన జరిగినట్టు..
జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో గురువారం బార్డర్ సెక్యూరిటీ దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్మూ నుంచి భద్రతా దళాలు శ్రీనగర్ వెళ్తుండగా జాతీయ రహదారి పై మాల్ పోరా- క్వాజి గండ్ వద్ద ఈ ఘటన జరిగినట్టు కాశ్మీర్ పోలీసు అధికారి విజయ్ కుమార్ తెలిపారు.ఉగ్రవాదుల కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు తెలిసిందన్నారు. ఈ ప్రాంతంలో టెర్రరిస్టులు మాటు వేసినట్టు తెలిసిందని, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని సమీపించగానే కాల్పులు ప్రారంభించారని ఆయన చెప్పారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న దృష్ట్యా.. పాక్ టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ లో చొరబడుతున్నారని, అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Xiaomi: టెక్ దిగ్గజం షావొమి నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్స్.. వీడియో
భారతదేశంలో మొట్టమొదటి సారి పూలపై అద్భుత ప్రయోగం.. ఎప్పటికీ వాడిపోని పూవులు..!! వీడియో