AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSLV F10: ఒకటి.. రెండు దశలు బాగానే సాగినా.. మూడోదశలో విఫలం.. ఇస్రో ప్రయోగం ఫెల్యూర్‌కు కారణాలు ఇవే..

ప్రతి ప్రయత్నం సక్సెస్‌ కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతి ప్రయత్నం సక్సెస్‌ అవుతుందనుకోవడం అత్యాశే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రోకు కూడా ఇది వర్తిస్తుంది. ఎప్పుడూ విజయాలు అందించే ఇస్రోకు ఒక జర్క్‌. నిప్పులు చెరుగుతుండే రాకెట్లను నింగిలోకి పంపే ఇస్రోకి- ఇదొక చిన్న మరక. ఫెయిల్యూర్‌ స్టోరీలు చెప్పుకునే చైనాతోనూ, అమెరికాతోనూ పోల్చితే మన ఇస్రోను మనం పోల్చుకోలేం. అంతరిక్షరంగంలో 90 శాతానికిపైగా సక్సెస్‌ రేటు ఉండే ఇస్రోకు తాజా రాకెట్‌ ప్రయోగం […]

GSLV F10: ఒకటి.. రెండు దశలు బాగానే సాగినా.. మూడోదశలో విఫలం.. ఇస్రో ప్రయోగం ఫెల్యూర్‌కు కారణాలు ఇవే..
Gslv F 10 Mission
Sanjay Kasula
|

Updated on: Aug 12, 2021 | 8:49 PM

Share

ప్రతి ప్రయత్నం సక్సెస్‌ కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతి ప్రయత్నం సక్సెస్‌ అవుతుందనుకోవడం అత్యాశే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రోకు కూడా ఇది వర్తిస్తుంది. ఎప్పుడూ విజయాలు అందించే ఇస్రోకు ఒక జర్క్‌. నిప్పులు చెరుగుతుండే రాకెట్లను నింగిలోకి పంపే ఇస్రోకి- ఇదొక చిన్న మరక. ఫెయిల్యూర్‌ స్టోరీలు చెప్పుకునే చైనాతోనూ, అమెరికాతోనూ పోల్చితే మన ఇస్రోను మనం పోల్చుకోలేం. అంతరిక్షరంగంలో 90 శాతానికిపైగా సక్సెస్‌ రేటు ఉండే ఇస్రోకు తాజా రాకెట్‌ ప్రయోగం నిరాశను మిగిల్చింది. అయితే, పాఠాలు నేర్చుకుని, తప్పులు దిద్దుకుని- ఇస్రో మరింత కసిగా పనిచేయడానికి- ఈ పరాజయం పునాది వేస్తుంది. అదేంటో చూడండి.

మేరా ఇస్రో మహాన్‌ అని గర్వంగా గుండెలు చరిచి చెప్పుకునే భారతీయులకు ఇది నిరాశ. ఎందుకంటే- జియో సింక్రనస్‌ లాంచ్‌ వెహికల్‌- GSLV F10 ప్రయోగం సక్సెస్‌ కాలేదు. ఒకవేళ, ఇదే సక్సెస్‌ అయితే, కథ మరోలా ఉంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో భారత విజయగాథతో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. మన యువకిశోరాలు- దేశకీర్తి విశ్వవ్యాప్తం చేసినందుకు- త్రివర్ణ పతాకం మురిసిపోయింది.

రియల్‌టైమ్‌ ఇమేజింగ్‌ అందించే ఉపగ్రహం ఇది. వ్యవసాయం, అడవులు, జలాశయాలకు సంబంధించిన తగిన సూచనలు చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలపై ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది. ఒకవేళ, ఈ ఉపగ్రహం గత ఏడాది మార్చి ఐదో తేదీన అనుకున్నట్లు రోదసీలోకి వెళ్లి.. భూమి చుట్టూ పరిభ్రమిస్తూ పనిచేస్తుంటే.. మనం చూసే ఈ వరదలను, ఈ అపార నష్టాన్ని కాస్తయిన నివారించేవాళ్లం.

కానీ ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లే GSLV-F10 రాకెట్‌లో కీలకమైన బ్యాటరీ సమస్య తలెత్తింది. బ్యాటరీలోని సమస్యల వల్లే- మూడో దశలో ఇగ్నిషన్‌ జరగలేదు. ఒకరకంగా చెప్పాలంటే సైంటిస్టుల సమస్య తీరలేదు. మూడో దశ ఎందుకు ఫెయిలైంది? మూడోదశ కాలవ్యవధి 720 సెకన్లు ఉంటుంది. ఈ క్రయోజెనిక్‌ స్టేజ్‌ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. సాలిడ్‌, లిక్విడ్‌ దశలకంటే మూడోదశలో తక్కువ ఉష్ణోగ్రతల్లో ప్రొపెల్లెంట్స్‌ను వాడారు.

మూడో స్టేజ్‌లో ఇగ్నిషన్‌ సరిగా జరగలేదు. సాంకేతిక సమస్యల వల్లే మూడో దశ విఫలమైంది. ఈ సమస్యలే GSLV-F10 కొంపముంచాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇస్రో కూడా ఇదే చెప్పింది. ఒకటి,రెండు దశలు బాగానే సాగినా, మూడోదశ విఫలమైంది. అందుకే ఈ మిషన్‌ అనుకున్నట్లు ముందుకు సాగలేదని ఇస్రో చెప్పింది.

పంద్రాగస్టు ముందు- GSLV F10 సక్సెస్‌ అయితే ఇదే మువ్వన్నెల జెండా పరవశించిపోయేది. సైంటిస్టులు పడిన కష్టానికి, రాత్రింబవళ్లు పడిన శ్రమకు 130 కోట్లమంది ప్రజలు జయజయధ్వానాలు చేసేవారు. కానీ అనుకున్నట్లు జరగకపోవడమే- ఒక చిన్న డిస్టర్బెన్స్‌.

అంతరిక్ష రంగంలో అగ్రదేశాలకు చెమటలు పట్టించే భారత్‌ మీద ప్రపంచానికి నమ్మకం ఉంది. భారత్‌ నుంచి ఉపగ్రహాలను ప్రయోగిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం అన్న విశ్వాసం ఉంది. 2017 ఫిబ్రవరిలో ఏకంగా 104 ఉపగ్రహాలను PSLV-C37 నింగిలోకి పంపి.. వహ్వా అనిపించుకుంది.

ఇప్పుడు మన అవసరాల కోసమే మనం పంపే ఉపగ్రహాన్ని కక్ష్యలో నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ రాకెట్‌ ద్వారా ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్‌- EOS-03 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాలని భావించారు. విజయాలే సాధించే ఇస్రోను అప్పుడప్పుడూ పరాజయాలు పలకరిస్తుంటాయి.

సైంటిస్టుల ఆత్మవిశ్వాసం దెబ్బతినదు. ఈ దేశం యావత్తూ ఇస్రో వెంట నిలబడుతోంది. అలాగే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌- ఈ సెప్టెంబర్‌లో నింగిలోకి వెళ్లబోతోంది. అయితే ఈసారి ఈ ఉపగ్రహాన్ని PSLV రాకెట్‌- మోసుకుపోతుంది. అలాగే ఈ ఏడాది ఆఖరుకల్లా స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ను కూడా ఇస్రో రోదసిలోకి పంపిస్తోంది. ఈ అపజయం- మరెన్నో అపజయాలకు పునాది వేస్తుందని ప్రతి భారతీయుడు నమ్ముతున్నాడు.

ఇవి కూడా చదవండి:  Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు..  

Credit Card Payment: మీరు క్రెడిట్ కార్డు బిల్ పే చేసేముందు ఇలా చేస్తే బోలెడు డబ్బులు కలిసి వస్తాయి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు