AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసియాలో అతిపొడవైన టన్నెల్: తొలి బ్లాస్టింగ్ చేసిన గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ బ్లాస్ చేశారు. అది కూడా తానెక్కడో ఢిల్లీలో కూర్చుని కశ్మీర్ లోయలో బాంబు పేల్చారు. వర్చువల్ విధానంలో నితిన్ గడ్కరీ పేల్చిన బాంబుతో ఓ పెద్ద ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి.

ఆసియాలో అతిపొడవైన టన్నెల్: తొలి బ్లాస్టింగ్ చేసిన గడ్కరీ
Rajesh Sharma
|

Updated on: Oct 15, 2020 | 3:22 PM

Share

Asia’s longest tunnel in Kashmir: ఆసియా ఖండంలోనే అతి పొడవైన రోడ్డు టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కశ్మీర్‌లోని మూడు ప్రదాన రీజియన్లను దగ్గర చేస్తూ నిర్మించ తలపెట్టిన ఈ అతి పొడవైన టన్నెల్ రోడ్డును తెలుగు సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిర్మించబోతుండడం విశేషం. ఈ టన్నెల్ నిర్మాణంలో భాగం కొండను తొలిచేందుకు తొలి బ్లాస్టింగ్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చేప్టటారు. వర్చువల్ విధానంలో ఆయన గురువారం తొలి బాంబును పేల్చారు.

జోజిలా టన్నెల్‌గా నామకరణం చేసిన ఈ టన్నెల్‌ను ఒకటో నెంబర్ జాతీయ రహదారిపై గందర్బల్ జిల్లాలో నిర్మిస్తున్నారు. అన్ని సీజన్లలో రవాణాకు ఉపకరించే ఈ టన్నెల్ రోడ్డు ద్వారా కశ్మీర్, ద్రాస్, కార్గిల్, లేహ్‌ ప్రాంతాల మధ్య రవాణాకు అనుకూలంగా వుంటుంది. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే.. కశ్మీర్ అభివృద్ది మరింత వేగవంతమవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారులు మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంజీనింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) మోడల్ ఈ టన్నెల్ రోడ్డును చేపట్టింది.

ఏడేళ్ళలో నిర్మాణం పూర్తి చేయాలన్న నిబంధనలతో ఈ టన్నెల్ ప్రాజెక్టును రూ.4,899.42 కోట్ల నిర్మాణ వ్యయంతో టెండర్‌ను పొందింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. గత ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును రివ్యూ చేసిన నితిన్ గడ్కరీ ప్రాజెక్టు వ్యయాన్ని మరింతగా తగ్గించేందుకు నిఫుణుల కమిటీకి రెఫర్ చేశారు. నిఫుణుల కమిటీ అడ్వైజ్ మేరకు ప్రస్తుతం నిర్మాణానికి శ్రీకారం పడింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిన దాని ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 6,808.69 కోట్లు.

Also read: సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే!

Also read: కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు

Also read: సముద్రంలో బోటు గల్లంతు