హత్రాస్ ఘటనపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపాటు

హత్రాస్ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. దారుణ హత్యాచారానికి గురైన యువతి మృతదేహాన్ని రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు దహనం చేస్తారా ? ఇదెంత దారుణం ?

  • Publish Date - 12:51 pm, Mon, 5 October 20 Edited By: Anil kumar poka
హత్రాస్ ఘటనపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపాటు

హత్రాస్ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. దారుణ హత్యాచారానికి గురైన యువతి మృతదేహాన్ని రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు దహనం చేస్తారా ? ఇదెంత దారుణం ? మొత్తం దేశ జ్ఞాపకాల్లో ఇదో విషాద ఘటనగా మిగిలిపోతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో ఇదంతా జరిగితే ఇక హిందూ సంస్కృతి గురించి ఆ పార్టీ మాట్లాడుతోందని ఆయన సెటైర్ వేశారు. బాధిత యువతి తల్లి విలపిస్తుండగా..తన కూతురిని  కడసారైనా చూసుకోకుండాఅనుమతించని పోలీసులు ఆ యువతి డెడ్ బాడీని   దహనం చేస్తారా అని గెహ్లాట్ అన్నారు. అయితే రాజస్థాన్ లో మాత్రం శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందా అని రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనను సవాల్ చేశారు.