Sasikala Politics : సామ దాన బేధ దండోపాయ.. అమిత్ షా బ్యాక్ గ్రౌండ్ బౌలింగ్, ఫోర్ గ్రౌండ్లో శశికళ నటరాజన్ క్లీన్ బౌల్డ్.!

Sasikala :  చిన్నమ్మ శశికళ, దివంగత నేత జయలలిత ఇష్ట సఖి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అమ్మ వారసురాలిగా తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించాలని కోటి ఆశలు పెట్టుకున్న..

  • Venkata Narayana
  • Publish Date - 10:21 am, Thu, 4 March 21
Sasikala Politics : సామ దాన బేధ దండోపాయ.. అమిత్ షా బ్యాక్ గ్రౌండ్ బౌలింగ్, ఫోర్ గ్రౌండ్లో శశికళ నటరాజన్ క్లీన్ బౌల్డ్.!
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవించి ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అయితే శశికళ ఉన్నట్టుండి రాజకీయాలు, ప్రజాజీవితానికి గుడ్‌బై చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. తనకు పదవుల మీద, అధికారం మీద ముందు నుంచే పెద్దగా ఆసక్తి లేదని ఆమె అన్నారు.

Sasikala Politics :  చిన్నమ్మ శశికళ, దివంగత నేత జయలలిత ఇష్ట సఖి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అమ్మ వారసురాలిగా తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించాలని కోటి ఆశలు పెట్టుకున్న చిన్నమ్మ, ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.? అనేదిప్పుడు తమిళనాటేకాదు, యావత్ భారతదేశంలోనే చర్చనీయాంశమైంది. అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో దోషిగా జైలు శిక్షను పూర్తి చేసుకుని, జనవరిలో విడుదలైన వీకే శశికళ నటరాజన్ తనను బహిష్కరించిన అన్నాడీఎంకే పార్టీపై తిరిగి పట్టు సాధించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇటీవలి జయలలిత జయంతి నాడు కూడా తమిళ సినీ, రాజకీయ వర్గాలు శశికళ ఇంటికి క్యూకట్టడం, దాంతో చిన్నమ్మ మళ్లీ జూలు విదిలించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ వాటన్నింటికీ సమాధానమన్నట్టు శశికళ ఏకంగా రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి తప్పుకున్నారు. పొలిటికల్, పబ్లిక్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ ఏకంగా ఆమె ఓ ప్రకటనే ఇచ్చారు.

ఇదిలాఉంటే, 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నమ్మయ తాజా నిర్ణయం బీజేపీతో జరిగిన డీల్ లో భాగమేనా. ? అన్నది ఇప్పుడు కీలకమైంది. జయ మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ లో తాను భర్తీ అయ్యేందుకు బీజేపీ పెద్దలు విశ్వప్రయత్నాలు చేయడం ఎవరూ కాదనలేని నిజం. సామదానబేధదండోపాయాలతో శశికళను జైలుకు పంపేసి, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలను మచ్చిక చేసుకోవడం, దెబ్బకు అన్నాడీఎంకేను ఎన్డీఏ భాగస్వామిగా మలుచుకోవడం అన్నీ చకాచకా జరిగిపోయాయి.

అయితే, ఈ ఏడాది జనవరిలో శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత పొలిటికల్ సీన్ చేంజ్ అవుతుందేమోనని అంతా ఊహించారు. అన్నాడీఎంకేపై శశికళ తిరిగి పట్టు బిగిస్తే బీజేపీతో కలిసి మనగలరా? అని ఊహాగానాలూ వినిపించాయి. ఒక వేళ శశికళ తోకజాడిస్తే మళ్లీ జైలుకు పంపేందుకూ బీజేపీ వెనుకాడబోదనే వాదనలను విస్తృతంగా నడిచాయి. వీటన్నిటికీ మధ్యే మార్గంగానే చిన్నమ్మ చివరికి రాజకీయాల నుంచి, ప్రజాజీవితం నుంచి పూర్తిగా తప్పుకోవడం ద్వారా సైలెంట్ అయిపోవాలనే శశికళ నిర్ణయించుకొన్నారన్నది తమిళనాట వినిపిస్తోన్న మాట. ఇదంతా ఓకే కాని, శశికళ తాజా నిర్ణయం ఆమెనే నమ్ముకున్న దినకరన్ ప్రాణాలమీదకి తెచ్చినట్టైంది. ఇప్పుడు దినకరన్ ఎలాంటి స్టెప్ వేస్తారు, అసలు ఆయన దారెటు.. అనేది ఆసక్తికరంగా మారింది.

Read also : Mandala Ramu : కత్తులు, గొడ్డళ్లు, వేటకొడవలు, చాకులతో టీఆర్ఎస్ ఎంపీటీసీపై మర్డర్ అటెంప్ట్

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..