- Telugu News Photo Gallery Political photos Assassination attempt on bhadradri kottagudem district illandu mandal indiranagar trs mptc mandala ramu 2
Mandala Ramu : కత్తులు, గొడ్డళ్లు, వేటకొడవలు, చాకులతో టీఆర్ఎస్ ఎంపీటీసీపై మర్డర్ అటెంప్ట్
Mandala Ramu : కత్తులు, గొడ్డళ్లు, వేటకొడవలు, చాకులతో టీఆర్ఎస్ ఎంపీటీసీపై మర్డర్ అటెంప్ట్
Updated on: Mar 04, 2021 | 7:56 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అనుచరుడు.. ఇల్లందు మండలం ఇందిరానగర్ టీఆర్ఎస్ ఎంపీటీసీ మండలరాముపై అర్థరాత్రి హత్యాయత్నం. తృటిలో తప్పించుకున్న రాము.

రామును హతమార్చేందుకు రాత్రి ఇల్లందు ప్రధాన రహదారిలోని సమ్మక్క ఆర్చి సమీపంలో ఆయుధంతో ఒక వ్యక్తి ఉండగా... మరికొంతమంది కారులో.. ఇలా, రోడ్డుకు ఇరువైపులా మాటు వేసుకొని ఉన్నారు.

గత సంవత్సరం మండల రాము పై ఇదే నెలలో హత్యా ప్రయత్నం చేశారు దుండగులు. అప్పుడు కూడా రాము బైకు పై వెళ్తుండగా కత్తులతో ఎటాక్ చేసి చంపాలని ప్రయత్నం చేశారు.

రాము తన అనుచరులతో కలసి సింగరేణి ఏర్పాటుచేసిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి వెళ్లి కలెక్టర్ కి మెమోరాండం సమర్పించి తిరిగి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. రాము పట్టణం వైపు బైక్ పై వెలుచుండగా ఒక వ్యక్తి తన పైకి ఆయుధంతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. రాము తప్పించుకొని బైక్ పై వెళ్తుండగా కారులో కొందరు వెంబడించారు.

జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గ్రూప్ వివాదాల నేపథ్యంలో నన్ను హతమార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాము అన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్దామన్నాడు.. తనకు న్యాయం చేయాలని రాము వేడుకుంటున్నాడు.

Kurnool Crimes

రాము వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దుండగులు పన్నిన పన్నాగాన్ని విఫలం చేసిన పోలీసులు. ఒకరిని అదుపులోకి తీసుకొని తమదైనస్టైల్ లో విచారణ చేయగా దుండగుడు ఇచ్చిన సమాచారం మేరకు భారీ ఎత్తున మారణ ఆయుధాలు స్వాధీన పరుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.