Delhi: ఢిల్లీ బస్సు డ్రైవర్లను హెచ్చరించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే
ఢిల్లీలోని బస్సు డ్రైవర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. 2019లో ఆప్ ప్రభుత్వం దేశ రాజధానిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది.
ఢిల్లీలోని బస్సు డ్రైవర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. 2019లో ఆప్ ప్రభుత్వం దేశ రాజధానిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఎంత మంది మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారనే నివేదికను బడ్జెట్ సమావేశాల్లో కూడా చూపిస్తున్నారు. అయితే గత కొన్నిరోజులుగా మహిళలు ఉన్నచోట కొంతమంది డ్రైవర్లు బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్నారు.
దీనిపై చాలామంది మహిళలు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే దీనిపై సీఎం కేజ్రీవల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. మహిళలు ఉన్నచోట బస్సు ఆపని డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవలే మధ్యతరగతి ప్రయాణికుల కోసం ప్రీమియం బస్సలు నడిపించేందుకు ప్రైవేటు అగ్రిగేటర్ల కోసం ఓ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేజ్రివాల్ తెలిపారు. అయితే ఇందులో మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండదని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..