Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచే సీఎంగా కేజ్రీవాల్ ఉత్తర్వులు.. ఫస్ట్ ఆర్డర్ ఇదే
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి తొలి ఆదేశాన్ని జారీ చేశారు. దేశరాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారు. జైల్లో ఉండగా ప్రభుత్వ నిర్వహణ అంత సులభం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ రూటే సెపరేటు. సామాన్యుడిగా పార్టీ నెలకొల్పినా, రెండు రాష్ట్రాల్లో అధికారం సాధించి ఆయన టాక్ ఆఫ్ ది కంట్రీ అయ్యారు. సీఎం హోదాలో జైలుకు వెళ్లినా ఆయన మార్కు పాలిటిక్స్ చూపిస్తున్నారు. లిక్కర్ కేసు విషయంలో ED కస్టడీలో ఉన్న కేజ్రీవాల్.. జైలు నుంచి కూడా పాలన ఎలా చేయాలో చేసి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ED కస్టడీ నుంచి తొలి ఆర్డర్ ఇచ్చారాయన. జలవనరుల విభాగానికి సంబంధించిన వర్క్ ఆర్డర్ కాపీని రిలీజ్ చేశారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో సమస్యలు తలెత్తడంతో.. సమస్యలు ఉన్నచోట, ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కేజ్రీవాల్. “ప్రజలు బాధపడకూడదు. ఎండాకాలం కూడా దగ్గర పడుతోంది. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా సహాయం కోరండి. ఆయన సహాయాన్ని తిరస్కరించరు” అని కూడా లేఖలో పేర్కొన్నారు.
కేజ్రీవాల్ ఇప్పటికీ తమ CM అని ఆమ్‌ఆద్మీ చెబుతోంది. జైల్లో ఉన్నా కేజ్రీవాల్ ప్రజల కోసమే పనిచేస్తారన్నారు ఢిల్లీ మంత్రి ఆతిషి. ED కస్టడీలో ఉన్నా, ప్రజల కోసం ఆయన ఆలోచిస్తూ, లేఖ రాసినపుడు, తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21 న దేశ రాజధానిలోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఆయన అధికారిక నివాసంలో సోదాలు చేసిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ED అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ని న్యాయస్థానం దోషిగా నిర్ధారణ చేయలేదంటోంది ఆప్. ఈ క్రమంలో కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఫస్ట్ ఆర్డర్ చర్చనీయాంశం అయింది. జైలు రూల్స్ ప్రకారం.. ఫ్యామిలీ మెంబర్స్, మిత్రులు, ఇతర సన్నిహితులు మాత్రమే ఖైదీని కలిసేందుకు జైలు నిబంధనలు అనుమతిస్తాయి.కాబట్టి, జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదని తీహార్ జైలు మాజీ న్యాయ అధికారులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




