Model Attacked: మద్యం మత్తులో యువతి హంగామా.. ఆర్మీ వాహనంపై దాడి.. అదుపులో తీసుకున్న పోలీసులు..!
Model Attacked: మద్యం మత్తులో ఓ అమ్మాయి హల్‌చల్ చేసింది. ఫుల్లుగా మద్యం తాగిన 22 ఏళ్ల మోడల్.. ఆర్మీ వాహనాన్ని అడ్డుకుని హంగామా చేసింది. దీంతో ఆమెను..

Model Attacked: మద్యం మత్తులో ఓ అమ్మాయి హల్‌చల్ చేసింది. ఫుల్లుగా మద్యం తాగిన 22 ఏళ్ల మోడల్.. ఆర్మీ వాహనాన్ని అడ్డుకుని హంగామా చేసింది. దీంతో ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఆమె బుధవారం రాత్రి నానా హంగామా సృష్టించిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు వచ్చిన మోడల్ మద్యం మత్తులో రోడ్డుపై గందరగోళాన్ని సృష్టించింది. ఆర్మీ వాహనాన్ని కాలుతో తన్నుతూ దాడికి పాల్పడి నానా హంగామా సృష్టించింది.
ఆమెను ఆపడానికి సైనిక అధికారి ప్రయత్నించగా, ఆయనను కూడా ఆమె నెట్టేసిందని అధికారులు తెలిపారు. వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు. అయితే ఢిల్లీ నుంచి ముగ్గురు బాలికలు గ్వాలియర్‌కు వచ్చారని, వారిలో ఒకామె రోడ్డుపై రచ్చ చేసిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. తర్వాత విడుదల చేశారు. ముగ్గురు అమ్మాయిలు ఢిల్లీ నుంచి గ్వాలియర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినట్లు వారు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.




