నడి రోడ్డుపై బాలుడి తల.. రంగంలోకి దిగిన రెండు ప్రత్యేక పోలీసు బృందాలు.. మృతదేహం కోసం గాలింపు..!
ఓ బాలుడి తల నడి రోడ్డుపై కుక్కలు తీసుకెళ్తున్న ఘటన సంచలనంగా మారింది. బాలుడిని నరబలి కోసం హత్య ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు...
ఓ బాలుడి తల నడి రోడ్డుపై కుక్కలు తీసుకెళ్తున్న ఘటన సంచలనంగా మారింది. బాలుడిని నరబలి కోసం హత్య ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని మధురైలో ఈ దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డు మీద ఓ బాలుడి తల లభ్యమైంది. ఈ విషయమై పోలీసులు సీనియర్‌గా తీసుకున్నారు. మధురై ఐటీ కార్యాలయం సమీపంలో ఓ బాలుడి తల కుక్కలు తీసుకెళ్తుండగా, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎవరో బాలుడి తల నరికి రోడ్డుమీద పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
బాలుడి తల దొరికినా.. మృతదేహం మాత్రం లభించలేదు. డెడ్‌బాడీ కోసం పోలీసులు చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడిని నరబలి ఇచ్చారా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.ఈ ఘటనపై రెండు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి బాలుడిని డెడ్‌బాడీ కోసం వెతుకుతున్నారు. బాలుడిని నరబలి కోసం హత్య చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.