AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏటీఎం చోరీకి దొంగ విఫలయత్నం.. క్యాష్‌ బాక్స్‌ ఎత్తుకెళ్లిన వైనం..

ఏటీఎం కార్డులతో అమాయకులను మోసం చేసి దోచుకునేవారు కొందరైతే.. ఏకంగా ఏటీఎంనే లూటీచేసేవారు మరికొందరు ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ వివరాలు.. ఓసారి చూసేయండి

ఏటీఎం చోరీకి దొంగ విఫలయత్నం.. క్యాష్‌ బాక్స్‌ ఎత్తుకెళ్లిన వైనం..
Atm Theft Representative Image
Ravi Kiran
|

Updated on: Aug 14, 2025 | 10:25 AM

Share

ఏటీఎం కార్డులతో అమాయకులను మోసం చేసి దోచుకునేవారు కొందరైతే.. ఏకంగా ఏటీఎంనే లూటీచేసేవారు మరికొందరు ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఓ పోలీస్‌ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

మంగళవారం అర్థరాత్రి బళ్లారిలోని కలమ్మ సర్కిల్ సమీపంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ఒక వ్యక్తి పగులగొట్టాడు. అందులో ఉన్న క్యాష్‌ బాక్స్‌ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం ఎలాగో పోలీసులకు తెలిసింది. దీంతో రాత్రి వేళ పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ మల్లికార్జున వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఏటీఎం చోరీకి పాల్పడిన దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీస్‌ అధికారిపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య కాసేపు పెనుగులాట జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న ఇతర పోలీస్‌ సిబ్బందిని ఆయన అలెర్ట్‌ చేశారు. చివరకు ఆ దొంగను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ను తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నివసించే వెంకటేష్‌గా నిందితుడ్ని గుర్తించారు. ఇదంతా ఏటీఎం వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..