YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటి.. పోలవరం ప్రాజెక్ట్‌పైనే ప్రధాన చర్చ..
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. సీఎం వెంట ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు..
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. సీఎం వెంట ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు మండలాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పరిహారం అంశాన్ని ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. వెంటనే సాయం చేయాలని కోరతానని చెప్పారు. దాని తగ్గట్టే ఇవాళ ఆయన ప్రధానిని కలిసి ఆ విషయంపైనే చర్చించారు. ఇదొక్కటే కాకుండా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, పలు రాజకీయాంశాలపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. మరోవైపు మధ్యాహ్నం 12.30 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. అలాగే మధ్యాహ్నం కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌తో.. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది.
The Chief Minister of Andhra Pradesh, Shri @ysjagan called on PM @narendramodi. pic.twitter.com/blkPNS3UE0
— PMO India (@PMOIndia) August 22, 2022
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..