Chhattisgarh CM Baghel: యూపీ సర్కార్‌పై చత్తీస్‌ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే..?
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని చత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్ ఆరోపించారు.
Chhattisgarh CM Baghel: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని చత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్ ఆరోపించారు. యూపీలో అరాచకపు పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.యూపీలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పతనం ఖాయమన్నారు భూపేష్ భాఘేల్. యోగి ప్రభుత్వం పట్ల ప్రతిఒక్కరిలో అసంతృప్తి నెలకొందన్నారు. రైతులు, యువత, దళితులు, వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలు యోగి పనితీరుపై నిరాశతో ఉన్నారని భాఘేలా వ్యాఖ్యానించారు. యోగి సర్కార్ అధికారం నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉందని ధ్వజమెత్తారు. వారణాసిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ యోగి ఆదిత్యానాధ్ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ ప్లాంట్లు మూతపడి విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని భూపేష్ భాఘేల్ హెచ్చరించారు. కరెంట్ కష్టాలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. బొగ్గు దిగుమతులు కూడా నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరాలపై పెను ప్రభావం పడనుదని భాఘేల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించిన భాఘేలా.. లఖింపూర్ ఖేరి ఘటనలో రైతుల మరణాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత రైతులను కలిసేందుకు వచ్చిన తనతో పాటు ప్రియాంకా గాంధీని యోగి సర్కార్ అడ్డుకుందని విమర్శించారు.
There is anti-incumbency in the state. From farmers, youth, Scheduled community to traders, everyone is upset with the Chief Minister…Yogi govt will not retain power: Chhatisgarh CM Bhupesh Baghel on his recent visit to Uttar Pradesh pic.twitter.com/fMTtXlzVQh
— ANI (@ANI) October 11, 2021