Tamil Nadu: మరో ఘోరం.. ఉరేసుకుని విద్యార్థిని మృతి.. నెల రోజుల్లోనే మూడో ఘటన

తమిళనాడులో (Tamil Nadu) విద్యార్థినుల ఆత్మహత్య ఘటనలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. కల్లకురిచ్చి, కిలాచేరి ఘటనలు మరవకముందే కడలూరు జిల్లాలో మరో విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. తమిళనాడులోని కడలూరు జిల్లాకు....

Tamil Nadu: మరో ఘోరం.. ఉరేసుకుని విద్యార్థిని మృతి.. నెల రోజుల్లోనే మూడో ఘటన
child illness
Follow us

|

Updated on: Jul 26, 2022 | 5:39 PM

తమిళనాడులో (Tamil Nadu) విద్యార్థినుల ఆత్మహత్య ఘటనలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. కల్లకురిచ్చి, కిలాచేరి ఘటనలు మరవకముందే కడలూరు జిల్లాలో మరో విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన ఓ బాలిక..12వ తరగతి చదువుతోంది. తల్లి మందలించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు సిద్ధమవుతుండగా పోలీసులు సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం విరుతాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసు.. ఆ నోట్ లో బాలిక ఐఏఎస్ చదవాలని కోరుకున్నట్లు తెలిపింది. తనపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ వారి ఆశలను నెరవేర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. జులై నెలలోనే ఇది మూడో కేసు కావడం ఆందోళన కలిగిస్తోంది.

కాగా.. తిరువళ్లూరు జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలోని హాస్టలో లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుత్తణికి చెందిన బాలిక తిరువళ్లూరు జిల్లా కిలాచేరి గ్రామంలోని పాఠశాలలో చదువుతోంది. ఈ ఘటనపై మప్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేశారు. మరో ఘటనలో కళ్లకురిచ్చిలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. దీంతో జిల్లాలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. పోలీసు అధికారులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

ఆత్మహత్యల ఘటనలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలను వీడాలని కోరారు. కష్టాలను విజయాలుగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం