NITRD Recruitment 2022: రాత పరీక్షలేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..
కేంద్ర ప్రభుత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యుబర్‌క్యులాసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ (NITRD).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల (Junior Resident Posts) భర్తీకి..
NITRD Junior Resident Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యుబర్‌క్యులాసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ (NITRD).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల (Junior Resident Posts) భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది. మొత్తం 8 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. 30 ఏళ్లకు మించని అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జులై 30, 2022న నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. అడ్రస్: National Institute of Tuberculosis and Respiratory Diseases, Sri Aurobindo Marg, Near Qutab Minar, New Delhi-110030.
ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్ధులను జూనియర్ రెసిడెంట్లుగా నియామకం చేపడతారు. నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించి ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://www.nitrd.nic.in/ను క్లిక్ చేయండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.