- Telugu News Photo Gallery Phoolan Devi Death anniversary: If I am born again, I will be born as an animal, but I will not be born as a woman said Phoolan
Phoolan Devi Story in Telugu: ‘మళ్లీ జన్మంటూ ఉంటే జంతువుగానైనా పుడతాను గానీ స్త్రీగా జన్మించను’
సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ ఫూలన్ దేవి 21వ వర్ధంతి నేడు. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పూలన్ మరణించిన రోజును గుర్తు చేసుకుంటూ.. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాలం నాటి ఫొటో ఒకటి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫూలన్ దేవి సైకిల్‌పై ప్రచారం నిర్వహిస్తున్నప్పటిదని..
Updated on: Jul 25, 2022 | 7:05 PM

సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ ఫూలన్ దేవి 21వ వర్ధంతి నేడు. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పూలన్ మరణించిన రోజును గుర్తు చేసుకుంటూ.. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాలం నాటి ఫొటో ఒకటి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫూలన్ దేవి సైకిల్‌పై ప్రచారం నిర్వహిస్తున్నప్పటిదని అఖిలేష్ యాదవ్ తెలిపారు. 22 మంది అగ్రకుల వ్యక్తులను హత్య చేసినందుకు జైలు జీవితం గడిపిన ఫూలన్ దేవిని.. ములాయం సింగ్ యాదవ్ ఆమెపై ఉన్న అన్ని కేసులను విత్‌డ్రా చేశారు.

ఫూలన్ దేవి అప్పట్లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో ఆమె చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా తన తదుపరి జన్మ గురించి అడగగా.. వచ్చే జన్మలో జంతువుగానైనా పుడతానుగానీ, స్త్రీగా మాత్రం పుట్టను. మరొకసారి పూలన్ దేవిగా మళ్లీ మళ్లీ జీవించడం నాకు ఇష్టంలేదని తెగేసి చెప్పింది.

తదుపరి ప్రశ్నగా అత్యంత ఇష్టమైనదేదని అడుగగా.. దుర్గామా, నా పిల్లలు అని పూలన్ సమాధానం చెప్పింది. నీ జీవితం మారిపోతే ఎలా ఉండాలనుకుంటున్నావు అనే ప్రశ్నకు.. చిన్న పిల్లగా మారాలనుందని పూలన్ తెల్పింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ నుంచి ఫూలన్‌కు టిక్కెట్ ఇవ్వగా ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిచి మీర్జాపూర్ ఎంపీగా ఎంపికయ్యారు. సరిగ్గా ఇదే రోజున (జూలై 25) 2001ఢిల్లీలో ఫూలన్ దేవిని మాస్కులు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు.

ఫూలన్ మాత్రం తాను చేసిన పనులకు ఎప్పుడూ గర్వపడేదానని చెప్పుకునేది. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పూలన్ మాట్లాడుతూ.. 'ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. ఏ తప్పు చేయని నేనెందుకు చావాలి, నన్ను హింసించిన వారిని చంపాలని అనుకున్నాను. అనేక మంది నాపై కుట్రలు పన్నారు. ఒక వ్యక్తికి కోపం వస్తే ఖచ్చితంగా మంచి చేసే అవకాశం లేదని సమాధానం చెప్పింది.

ఈ కార్యక్రమంలో ములాయం సింగ్ యాదవ్‌పై పూలన్ ప్రశంశలు కురిపించారు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం ములాయం సింగ్ అని ఫూలన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.




