AP EAMCET 2022 Results: రేపే ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలు.. ఎన్ని గంటల కంటే..
ఏపీ ఈఏపీసెట్ 2022 పరీక్షల ఫలితాలు రేపు (జులై 26) విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మంగళవారం ఉదయం..
AP EAPCET 2022 Result date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2022 పరీక్షల ఫలితాలు రేపు (జులై 26) విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని హోటల్ లెమన్ ట్రీ ప్రీమియర్‌లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఇతర అధికారులు హాజరుకానున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఫలితాల అనంతరం అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/లో విద్యార్ధులు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ పరీక్షలు జులై 4 నుంచి 12వ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 3,84,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల అనంతరం నిర్వహించే బీఈ, బీటెక్, బీటెక్ (బయోటెక్), బీటెక్ (డైరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ వెయటేజీ రద్దు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి (APSCHE) ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పూర్తిగా ఏపీ ఈఏపీసెట్ 2022లో సాధించిన ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.