AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తోన్న CT యూనివర్సిటీ.. పెరుగుతోన్న పోటీకి అనుగుణంగా..

CT University: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తోంది పంజాబ్‌లోని సీటీ యూనివర్సిటీ. లుధియానాలో ఉన్న ఈ యూనివర్సిటీ విద్యా రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తోన్న CT యూనివర్సిటీ.. పెరుగుతోన్న పోటీకి అనుగుణంగా..
CT University
Narender Vaitla
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 27, 2022 | 11:20 AM

Share

Education News: విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీస్తూ.. ఓవైపు అకడమిక్‌లో భాగంగా సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను అందిస్తూ, మరోవైపు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తోంది పంజాబ్‌లోని సీటీ యూనివర్సిటీ (CT University). లుధియానాలో ఉన్న ఈ యూనివర్సిటీ విద్యా రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు పొందగలిగే నైపుణ్యాలను అందిస్తోంది. 25 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు గాను 50కి పైగా అకడమిక్‌ ప్రోగ్రామ్స్‌తో పాటు, ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు, 25 దేశాలకు చెందిన 4000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ వర్సిటీలోని ఇండస్ట్రీ ఆధారిత విద్యా విధానం ద్వారా విద్యార్థులు డిగ్రీ పూర్తి చేయగానే ఉద్యోగాలు పొందే సామర్థ్యాన్ని పొందుతారు. ఐబీఎమ్‌, బోష్‌, సిస్కోతో పాటు పలు ప్రముఖ కంపెనీలతో సీటీ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. ఐబీఎమ్‌ కంపెనీతో కలిసి సైబర్‌ సెక్యూరిటీ, ఫోరెన్సిక్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ అండ్‌ డేటా సైన్సెస్‌, బిజినెస్‌ అనాలిటిక్స్‌లాంటి అంశాల్లో విద్యార్థులకు రియల్‌ టైమ్‌ అవగాహన కల్పిస్తున్నారు.

అంతర్జాతీయ విద్యా సంస్థలతో ఒప్పందంలో భాగంగా అమెరికాలోని లింక్‌ యూనివర్సిటీ, నార్త్‌ అలాంబ యూనివర్సిటీ, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్స్‌ నుంచి విద్యార్థులకు బిజినెస్‌ స్ట్రాటజీ, బిజినెస్‌ అనాలిటిక్స్‌ వంటి అంశాల్లో నైపుణ్యాలు నేర్పించి సర్టిఫికేట్‌ కూడా అందిస్తాం. ఇందులో భాగంగానే వైద్య రంగానికి గాను.. ఐవీవై ఆసుపత్రి, మ్యాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, ఇందుస్‌ హాస్పిటల్‌, సాంకర ఐ హాస్పిటల్‌, ఇండియన్‌ ఫార్మసీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్‌ వంటి వాటితో సీటీ యూనివర్సిటీ ఒప్పంద చేసుకుంది.

ఇక సీటీ యూనివర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కోసం పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా క్రియేషన్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇంక్యూబేషన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీ, రొబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ ల్యాబ్‌ వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఇతర ఏజెన్సీల ద్వారా పరిశోధనలకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రపంచ స్థాయి విద్యను అందించే క్రమంలో సెంటర్స్‌ ఫర్‌ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేసింది. అలాగే మైక్రోచిప్‌ టెక్నాలజీ, సిస్కో నెట్‌వర్క్‌ అకాడమీ, బ్లూ ప్రిజమ్‌ అకాడమీ ప్రోగ్రామ్‌, ఏడబ్ల్యూఎస్‌ అకాడమీ, రెడ్‌ హ్యాట్ అకాడమీ వంటి సంస్థలతో కలిసి గ్లోబల్‌ అకడమిక్‌ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో పెరుగుతోన్న పోటీకి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో విద్య వ్యవస్థలో సరికొత్త అధ్యాయనానికి సీటీ యూనివర్సిటీ తెర తీసింది.

మరిన్ని ఎడ్యుకేషన్ కథనాలు చదవండి..