చెన్నైలోని వండలూర్ జూలో కరోనాతో మరో సింహం మృతి…..అధికారుల్లో అయోమయం

చెన్నైలోని వండలూరు జూలో మరో సింహం కోవిద్-19 తో మృతి చెందింది. 12 ఏళ్ళ ఈ సింహానికి ఈ నెల 3 న కరోనా పాజిటివ్ సోకడంతో అప్పటి నుంచి దీనికి ప్రత్యేక ఇంటెన్సివ్ ట్రీట్ మెంట్ ఇస్తూ వచ్చారు.

  • Publish Date - 6:28 pm, Wed, 16 June 21 Edited By: Phani CH
చెన్నైలోని వండలూర్ జూలో కరోనాతో మరో సింహం మృతి.....అధికారుల్లో అయోమయం
Another Lion Dies At Chenna

చెన్నైలోని వండలూరు జూలో మరో సింహం కోవిద్-19 తో మృతి చెందింది. 12 ఏళ్ళ ఈ సింహానికి ఈ నెల 3 న కరోనా పాజిటివ్ సోకడంతో అప్పటి నుంచి దీనికి ప్రత్యేక ఇంటెన్సివ్ ట్రీట్ మెంట్ ఇస్తూ వచ్చారు. ‘పథభనాథన్’ అని వ్యవహరించే ఈ లయన్ ఈ ఉదయం 10 గంటల 15 నిముషాల ప్రాంతంలో మరణించిందని, దీన్ని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని జూ అధికారులు తెలిపారు. ఈ సింహం శాంపిల్స్ ని భోపాల్ లోని వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కి పంపగా అప్పుడే దీనికి పాజిటివ్ అని నిర్ధారించారని వారు చెప్పారు. ఇదివరకే ఈ జంతు ప్రదర్శనశాలలో ఓ సింహం కోవిద్ బారిన పడి మృతి చెందింది. ఇప్పుడు ఇది రెండో సింహమని, వీటి బాగోగుల పట్ల వెటర్నరీ డాక్టర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోతోందని వారన్నారు. ఇక్కడి సఫారీ పార్కులో ఉన్న మిగతా 5 సింహాలు తరచూ దగ్గుతున్నాయి. గత మే 26 నుంచి అనారోగ్యానంతో ఉన్న వీటి పట్ల కూడా వెటర్నరీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు/. మొత్తం 11 సింహాల రక్త నమూనాలను, వాటి నాసల్ శ్వాబ్ ను భోపాల్ లోని ల్యాబ్ కు పంపినట్టు అధికారులు తెలిపారు.

గత ఆదివారం సీఎం ఎం.కె. స్టాలిన్ ఈ జూను సందర్శించి ఇక్కడి జంతువుల పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా సింహాల ట్రీట్ మెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,వాటి వైద్య చికిత్సలో ఎలాంటి లోపం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. కానీ తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇవి అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు వాపోతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పాకిస్తాన్ లో మరో ‘డొనాల్డ్ ట్రంప్’ ! అచ్చు గుద్దినట్టు ఉన్నాడే ..! కానీ ఆయన ఏం చేస్తున్నాడో చూడండి !

Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..