మీ నిర్ణయాన్ని ఉపసంహరించండి….లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు చిరాగ్ పాశ్వాన్ లేఖ…. తానే ఎల్ జే పీ నేతనని ప్రకటన

తన అంకుల్ పశుపతి కుమార్ పరాస్ ను లోక్ సభలో లోక్ జన శక్తి పార్టీ నేతగా గుర్తిస్తూ స్పీకర్ ఓం బిర్లాతీసుకున్న నిర్ణయం సరికాదని ఈ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

మీ నిర్ణయాన్ని ఉపసంహరించండి....లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు చిరాగ్ పాశ్వాన్ లేఖ.... తానే ఎల్ జే పీ నేతనని ప్రకటన
Chirag Paswan
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 16, 2021 | 8:05 PM

తన అంకుల్ పశుపతి కుమార్ పరాస్ ను లోక్ సభలో లోక్ జన శక్తి పార్టీ నేతగా గుర్తిస్తూ స్పీకర్ ఓం బిర్లాతీసుకున్న నిర్ణయం సరికాదని ఈ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఈ మేరకు అయన ఓం బిర్లాకు లేఖ రాస్తూ.. ఇది తమ పార్టీ నియమావళికి విరుద్ధమన్నారు.తనకు వ్యతిరేకంగా చేతులు కలిపిన 5 గురు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించాలని తాము నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. మా అంకుల్ ని సభలో పార్టీ నేతగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి.. నన్ను నేతగా ప్రకటించండి అని చిరాగ్ పాశ్వాన్ తన లేఖలో కోరారు.. ఈ మేరకు కొత్త సర్క్యులర్ జారీ చేయాలన్నారు. మా పార్టీలోని 26 వ నియమావళి ప్రకారం..లోక్ సభలో ఎవరు నేతగా ఉండాలో నిర్ణయించే అధికారం సెంట్రల్ పార్లమెంటరీ బోర్డుకు ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా సభలో పశుపతిని పార్టీ నాయకునిగా గుర్తించడం సబబు కాదని చిరాగ్ పాశ్వాన్ వివరించారు. ఇప్పటికే ఈ 5 గురు ఎంపీలను రెబెల్ నేతలుగా పత్రికలు పేర్కొంటున్నాయి అని ఆయన గుర్తు చేశారు. మాదే అసలైన పార్టీ.. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.

కాగా బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రెబెల్ గ్రూప్ పై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. తాను అనారోగ్యం బారిన పడినప్పుడు తన వెనుక పెద్ద కుట్ర జరిగిందన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే లేకుండా ఒంటరిగా పోటీ చేయాలన్న తన నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. నేను రామ్ విలాస్ పాశ్వాన్ వంటి సింహం కుమారుడిని అని చిరాగ్ పాశ్వాన్ అభివర్ణించుకున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: శునకంతో రవిశాస్త్రి ప్రాక్టీస్.. విన్‌స్టన్‌ గుడ్‌బాయ్‌ అంటూ నెటిజన్ల పొగడ్తలు!

Viral Video: మనుషుల్లాగే ఫోజులు ఇస్తోన్న కుక్క.. వీడియో చిత్రీకరిస్తూ డ్యాన్స్‌లు.. ఫన్నీ వీడియో వైరల్