ఒడిశాలో పట్టాలు తప్పిన ప్రైవేటు గూడ్స్ రైలు.. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం..
ఓ ప్రైవేటు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. డుంగ్రీ లైమ్‌స్టోన్ మైన్స్, ACC బర్గర్ సిమెంట్ ప్లాంట్‌లో ఈ రైలు పక్కకు ఒరిగింది. ఫ్యాక్టరీ నుంచి సున్నపురాయి లోడ్‌ను గోడౌన్స్‌లోకి తీసుకెళ్తుండగా ఈ ట్రైన్ పట్టాలు తప్పింది. మధ్య ప్రైవేట్ నారో గేజ్ రైలు మార్గం ఉంది.
ఒడిశాలో ఓ ప్రైవేటు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. డుంగ్రీ లైమ్‌స్టోన్ మైన్స్, ACC బర్గర్ సిమెంట్ ప్లాంట్‌లో ఈ రైలు పక్కకు ఒరిగింది. ఫ్యాక్టరీ నుంచి సున్నపురాయి లోడ్‌ను గోడౌన్స్‌లోకి తీసుకెళ్తుండగా ఈ ట్రైన్ పట్టాలు తప్పింది. మధ్య ప్రైవేట్ నారో గేజ్ రైలు మార్గం ఉంది. లైన్, వ్యాగన్లు, లోకో అన్నీ ప్రైవేట్‌గా ఉంటాయి. ఇది భారతీయ రైల్వే వ్యవస్థతో ఏ విధంగానూ సంబంధం లేదు. ఇది చాలా చిన్న ట్రైన్.. ఇందులో కేవలం సిమెంట్ బ్యాగ్స్ మాత్రమే తరలిస్తుంటారు. అది కూడా కంపెనీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రమే ఈ స్మాల్ గూడ్స్ ట్రైన్ ఉపయోగిస్తుంటారు.
అందుకే రైలు ప్రమాదం జరిగింది
చక్రం పగిలిపోవడంతో రైలులోని 5 కంటైనర్లు బోల్తా పడ్డాయని తెలుస్తోంది. బార్‌ఘర్‌లోని ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపురాయిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మెయిన్ లైన్ ఆపరేషన్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు
రైల్వేశాఖ నిర్వహించని ప్రైవేట్ సైడింగ్ అయిన బార్‌ఘర్ సమీపంలోని ఏసీసీ సిమెంట్ ప్లాంట్ లోపల వేసిన ప్రైవేట్ ట్రాక్‌పై ఈ ప్రమాదం జరిగింది. ఇది బార్‌గర్ సిమెంట్ వర్క్స్ యాజమాన్యంలోని నారో గేజ్ లైన్. ప్రైవేట్ సైడింగ్ కారణంగా, ఈ లైన్‌ను రైల్వేలు నిర్వహించడం లేదు. ప్రమాదం తర్వాత, మెయిన్ లైన్‌లో రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడలేదు.
#WATCH | Some wagons of a goods train operated by a private cement factory derailed inside the factory premises near Mendhapali of Bargarh district in Odisha. There is no role of Railways in this matter: East Coast Railway pic.twitter.com/x6pJ3H9DRC
— ANI (@ANI) June 5, 2023
కేంద్ర రైల్వేకు సంబంధం లేదు..
ప్రభుత్వ రైల్వేకు ఈ ట్రాక్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఫ్యాక్టరీ అవసరాల కోసం వేసుకున్న ట్రాక్ మాత్రమే. ఫ్యాక్టరీ అంతర్గత వ్యవహరాలకు ఉపయోగించే గూడ్స్ ట్రైన్‌గా గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం