Anant Ambani: అన్న సేవతో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ షురూ.. 51 వేల మందికి రుచికరమైన భోజనాలు

భారత దేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహం కొద్దిరోజుల్లోనే జరుగబోతుంది. అయితే పెళ్లికి ముందే  ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Anant Ambani: అన్న సేవతో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ షురూ.. 51 వేల మందికి రుచికరమైన భోజనాలు
Ananth Ambani
Follow us
Balu Jajala

| Edited By: Anil kumar poka

Updated on: Mar 02, 2024 | 9:41 AM

భారత దేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహం కొద్దిరోజుల్లోనే జరుగబోతుంది. అయితే పెళ్లికి ముందే  ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జామ్ నగర్ లోని రిలయన్స్ టౌన్ షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో ముకేశ్ అంబానీ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, ఇతర అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్థులకు సంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని వడ్డించారు. రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా అన్నదాన సేవలో పాల్గొన్నారు.

సుమారు 51 వేల మంది స్థానికులకు భోజనం వడ్డించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో రాబోయే కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. అంబానీ కుటుంబం స్థానికుల ఆశీర్వాదం పొందడానికి అన్న సేవను నిర్వహించింది. భోజనానంతరం హాజరైన వారు సంప్రదాయ జానపద సంగీతంతో మైమరిచిపోయారు. ప్రఖ్యాత గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వీ ఈ కార్యక్రమానికి సంగీత ఆకర్షణను నిలిచాడు.

అంబానీ కుటుంబంలో ఫుడ్ సర్వీస్ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. కుటుంబ శుభకార్యాల సమయంలో అంబానీ కుటుంబం ఆహార సేవలను అందిస్తూనే ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభంలో ఉన్నప్పుడు, దేశం కష్టాల్లో ఉన్నప్పుడు, అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ నాయకత్వంలో, రిలయన్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. కుటుంబ సంప్రదాయాన్ని పాటిస్తూ అనంత్ అంబానీ ఫుడ్ సర్వీస్ తో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ను ప్రారంభించారు.