PM Modi - TV9 WITT: ఈ దశాబ్దకాలం అభివృద్ధికి స్వర్ణయుగం.. టీవీ9 వేదికపై ప్రధాని మోదీ.. పూర్తి వీడియో

PM Modi – TV9 WITT: ఈ దశాబ్దకాలం అభివృద్ధికి స్వర్ణయుగం.. టీవీ9 వేదికపై ప్రధాని మోదీ.. పూర్తి వీడియో

Shaik Madar Saheb

|

Updated on: Feb 29, 2024 | 8:49 PM

What India Thinks Today Global Summit: టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌ చరిత్ర సృష్టించింది. TV9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది.. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరిగిన టీవీ9 సత్తా సమ్మేళన్ లో దేశ విదేశాల ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సమ్మిట్ లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 వేదికగా సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు ప్రధాని మోదీ.

What India Thinks Today Global Summit: టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌ చరిత్ర సృష్టించింది. TV9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది.. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరిగిన టీవీ9 సత్తా సమ్మేళన్ లో దేశ విదేశాల ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సమ్మిట్ లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 వేదికగా సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు ప్రధాని మోదీ. మరోసారి తమ ప్రభుత్వమే ఖాయమని , అతివేగంగా , అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. టీవీ9 సమ్మిట్‌లో దేశానికి చక్కని సందేశమిచ్చారు ప్రధాని మోదీ. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌ నిదర్శనమన్నారు. టీవీ9 దీనికి ప్రతిబింబమని ప్రశంసించారు. శతాబ్దాల నుంచి భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపిచిందన్నారు ప్రధాని మోదీ . ఆర్టికల్‌ 370 రద్దు , అయోధ్యలో రామాలయ నిర్మాణం, ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు లాంటి సంచలన నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. మూడోసారి బీజేపీ ప్రభుత్వమే అధికారం లోకి వస్తుందని టీవీ9 సమ్మిట్‌ సాక్షిగా ప్రకటించారు ప్రధాని మోదీ. రానున్న ఐదేళ్లలో దేశ అభివృద్దిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామన్నారు. ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకుంటామని ప్రకటించారు.

భారత్‌ నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహించాలన్నారు మోదీ. దేశంలో ప్రతి రోజు రెండు కాలేజ్‌లను , ప్రతి వారం ఒక యూనివర్సిటీని ప్రారంభిస్తునట్టు తెలిపారు. తమ ప్రభుత్వం 2014లో అధికారం లోకి వచ్చాక గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టిన ఎన్నో ప్రాజెక్ట్‌లను శరవేగంగా పూర్తిచేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అంతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు మోదీ. కుటుంబపాలనతో దేశానికి ఎంతో నష్టం జరిగిందన్నారు. గత పాలకుల చెడు నిర్ణయాలకు తాము గుడ్‌బై చెప్పామన్నారు. నెహ్రూ హయాం నుంచి భారతీయుల శక్తి , సామర్ధ్యాలను తక్కువ చూపే ప్రయత్నం జరిగిందని.. గత పాలకులు భారతీయులను నిరాశవాదులుగా , అసమర్ధులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. మనం మనస్సులో ఏది అనుకుంటే అది జరుగుతుందన్నారు మోదీ. గెలుస్తామని అనుకుంటే గెలుస్తామని , ఓడిపోతామని అనుకుంటే ఓడిపోతామని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం మోదీ గ్యారంటీ అని.. లోక్‌సభ ఎలక్షన్‌ స్లోగన్‌ని టీవీ9 వేదికగా రివీల్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 28, 2024 09:45 PM