Amit Shah: తెలంగాణ వైపు బీజేపీ చూపు.. ముఖ్య నాయకులతో రేపు అమిత్ షా భేటీ..
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే.. మిషన్ 90తో వ్యూహాలను రచించిన బీజేపీ.. నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే.. మిషన్ 90తో వ్యూహాలను రచించిన బీజేపీ.. నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలోతెలంగాణ ముఖ్యనేతలకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, వివేక్, జితేందర్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మిషన్ 90, తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రణాళిక పై చర్చ జరగనున్నట్లు పేర్కొంటున్నారు.
అధిష్టానం నుంచి పిలుపు రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సహా కీలక నేతలంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. మిషన్ 90 పేరుతో ఇప్పటికే తెలంగాణలో ఆపరేషన్ చేపట్టింది పార్టీ. ఇందుకోసం 10 నెలలకు కావాల్సిన రోడ్‌మ్యాప్ ఇచ్చింది. ఇందులో భాగంగా యాక్షన్ ప్లాన్ అమలు తీరుతో పాటు.. నాయకత్వానికి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ విస్తరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇంకా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం.. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయాన్ని సైతం తెలుసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..