‘మీకు దమ్ముందా ? సీఏఏపై చర్చకు రండి’.. విపక్షాలకు అమిత్ షా సవాల్
సవరించిన పౌరసత్వ చట్టంపై చర్చకు రావాలని హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ‘ ఎవరు అడ్డొచ్చినా సరే ! ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రసక్తే ఉండదు’ అన్నారాయన. ఎవరు, ఎన్ని నిరసనలు వ్యక్తం చేసినా.. విపక్షాలకు తాము భయపడబోమని, అసలు ‘భయంలో నుంచే తాము పుట్టామని’ ఆయన వ్యాఖ్యానించారు. లక్నోలో మంగళవారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ వంటివారు ఈ చట్టం మీద చర్చకు రావాలన్నారు. […]
సవరించిన పౌరసత్వ చట్టంపై చర్చకు రావాలని హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ‘ ఎవరు అడ్డొచ్చినా సరే ! ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రసక్తే ఉండదు’ అన్నారాయన. ఎవరు, ఎన్ని నిరసనలు వ్యక్తం చేసినా.. విపక్షాలకు తాము భయపడబోమని, అసలు ‘భయంలో నుంచే తాము పుట్టామని’ ఆయన వ్యాఖ్యానించారు. లక్నోలో మంగళవారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ వంటివారు ఈ చట్టం మీద చర్చకు రావాలన్నారు. ప్రతిపక్షాల కళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగుతో కప్పబడిపోయాయని, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటివి అసత్యాలు చెబుతున్నాయని అమిత్ షా ఆరోపించారు. ‘ మమతా దీదీ, మాయావతిజీ.. అఖిలేష్ జీ.. ఈ దేశంలో ఎక్కడైనా సరే.. సీఏఏపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేస్తున్నా ‘ అని అన్నారు. ఒకరి పౌరసత్వాన్ని లాక్కునే నిబంధన ఈ బిల్లులో ఒక్కటైనా ఉందేమో చూపండి అని కూడా అన్నారు. పాకిస్థాన్ నుంచి అక్రమ మైగ్రేషన్, టెర్రరిజం ఇన్నేళ్ళుగా ఈ దేశంలోకి ‘చొరబడుతున్నా’..కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, అలియా, మలియా, జమాలియాలు ఇక్కడికి వచ్చి బాంబులు పేల్చుతున్నా ‘ మౌనీబాబా’ మన్మోహన్ సింగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అమిత్ షా విమర్శించారు.
సీఏఏకు నిరసనగా భారీ ర్యాలీలు, హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ కూడా ఒకటి. లక్నోలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. గత వారం నుంచి ఈ నగరంలో ముస్లిములు నిరవధిక ఆందోళనలు చేస్తున్నారు.