జొమాటో చేతికి ఉబర్ ఈట్స్.. డీల్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఉబర్ టెక్నాలజీస్ కు చెందిన ‘ఉబర్‌ ఈట్స్‌’ పేరుతో ఇండియాలో ఫుడ్ డెలివరీ చేస్తోన్న సంస్థను కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికే డీల్ కుదిరిందని.. ఆ డీల్ విలువ 350 మిలియన్‌ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. ఆల్-స్టాక్ ఒప్పందంలో ఉబర్ టెక్నాలజీస్ ఇంక్ యొక్క ఇండియన్ ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు ఫుడ్ డెలివరీ […]

జొమాటో చేతికి ఉబర్ ఈట్స్.. డీల్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 21, 2020 | 5:15 PM

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఉబర్ టెక్నాలజీస్ కు చెందిన ‘ఉబర్‌ ఈట్స్‌’ పేరుతో ఇండియాలో ఫుడ్ డెలివరీ చేస్తోన్న సంస్థను కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికే డీల్ కుదిరిందని.. ఆ డీల్ విలువ 350 మిలియన్‌ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. ఆల్-స్టాక్ ఒప్పందంలో ఉబర్ టెక్నాలజీస్ ఇంక్ యొక్క ఇండియన్ ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో పేర్కొంది.

ఉబర్ టెక్నాలజీస్ కు చెందిన ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ ఈట్స్ 2017లో కార్యకలాపాల్ని ప్రారంభించింది.. భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కష్టపడింది. దీనికి ప్రధాన కారణం.. జోమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు భారతదేశంలో ఆహార పంపిణీ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడమే. ఈ నెల మొదట్లో జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్‌ గోయల్‌ మాట్లాడుతూ కంపెనీ 600 మిలియన్‌ డాలర్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉబర్‌.. అంతర్జాతీయంగా తమ సంస్థకు నష్టాలను తెస్తున్న వ్యాపార విభాగాలను తగ్గించుకోవడంలో భాగంగానే తమ వ్యాపారాన్ని విక్రయించినట్లు తెలిపింది. జొమాటో రోజుకు 13లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తుండగా.. 1,50,000 రెస్టారెంట్లతో ఒప్పందం చేసుకొంది. కాగా.. “జోమాటో భారతదేశంలో ఉబెర్ ఈట్స్ ను కొనుగోలు చేసినట్లు మేం ఈ రోజు ప్రకటించాం.. మీరు ఇకపై భారతదేశంలో ఉబెర్ ఈట్స్ నుండి ఆర్డర్ చేయలేరు.. కానీ, మీకు ఇష్టమైన భోజనాన్ని ఆస్వాదించగలుగుతారు… జోమాటోలో మీ కోసం రూపొందించిన అద్భుతమైన ఆఫర్‌లతో… అంటూ పేర్కొంది. ఇక, జొమాటో-ఉబర్‌ ఈట్స్‌ ఇండియా డీల్ వెంటనే అమల్లోకి వచ్చేసినట్టు తెలుస్తోంది.

[svt-event date=”21/01/2020,3:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]