AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు హైదరాబాద్‌కు అమిత్ షా… నేరుగా చార్మినార్ వద్దకే… భారీగా కేంద్ర బలగాల మోహరింపు

నివర్ తుఫాన్ ఎఫెక్ట్‌తో యావత్ తెలంగాణ ప్రజానికం చలితో గజగజ వణికిపోతుంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రూపంలో పొలిటికల్ పార్టీలు తమ మార్క్ క్యాంపెయిన్‌తో హీట్ పెంచుతూ చలికి సైతం ఉక్కపోత పెట్టిస్తున్నాయి.

రేపు హైదరాబాద్‌కు అమిత్ షా... నేరుగా చార్మినార్ వద్దకే... భారీగా కేంద్ర బలగాల మోహరింపు
Shiva Prajapati
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Nov 28, 2020 | 6:03 PM

Share

నివర్ తుఫాన్ ఎఫెక్ట్‌తో యావత్ తెలంగాణ ప్రజానికం చలితో గజగజ వణికిపోతుంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రూపంలో పొలిటికల్ పార్టీలు తమ మార్క్ క్యాంపెయిన్‌తో హీట్ పెంచుతూ చలికి సైతం ఉక్కపోత పెట్టిస్తున్నాయి. భాగ్యనగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసే సమయం ఆసన్నమవుతున్నా కొద్దీ… పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆ పార్టీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం జీహెచ్ఎంసీలో తన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2 అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంటరవుతున్నారు.

బల్దియా ఎన్నికల ప్రచారం కోసం హోంమంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్‌కు వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నేరుగా చార్మినార్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించనున్నారు. దాదాపు 30 నిమిషాల పాలు ఆయన ఆలయం వద్దే ఉంటారని తెలుస్తోంది. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడలో అమిత్ షా రోడ్‌ షో నిర్వహిస్తారు. అమిత్ షా వెంట యోగి ఆదిత్యనాధ్ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే హోంమంత్రి అమిత్ షా చార్మినార్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీకి భారీగా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దింపారు. ఈరోజు సాయంత్రం నుంచే పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదిలాఉండగా,కేంద్ర హొంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటననకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ బీజేపీ శనివారం విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం అమిత్ షా పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి…

  • ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరుతారు.
  • 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ, ఎన్నికల ఇన్‌ఛార్జి భూపేంద్ర యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అమిత్ షాకు స్వాగతం పలుకుతారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
  • 10. 15 గంటలకుబేగం పేట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.45కి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు అమిత్ షా చేరుకుంటారు.
  • 10. 45 నుంచి 11.15 వరకు దాదాపు 30 నిమిషాలు అమిత్ షా భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
  • 11.15కి భాగ్యలక్ష్మి టెంపుల్ నుండి బయలుదేరి 11.45కి వారాసిగూడ చౌరస్తాకు చేరుకుంటారు.
  • 11.45 నుండి 13.00 గంటల వరకు వారాసిగూడ చౌరస్తా నుండి సీతాఫల్‌మండిలో గట హనుమాన్ టెంపుల్ వరకు రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు.
  • 13.30 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.
  • 13.30 నుంచి 14.30 పార్టీ కార్యాలయంలో నేతలతో కలిసి భోజనం చేస్తారు.
  • 14.30 నుంచి 15.30 వరకు విశ్రాంతి తీసుకుంటారు.
  • 16.00 గంటలకు బీజేపీ ఆఫీసు నుండి బయలుదేరి 17.00 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  • 17.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరుతారు.
  • 19.30 గంటలకు అమిత్ షా ఢిల్లీకి చేరుకుంటారు.