Punjab Elections 2022: పంచ నదుల పంజాబ్‌ పంచముఖ పోరులో.. ఎవరిది జోరు?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్‌కు చేరింది. ఆ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో ఆదివారం (ఫిబ్రవరి 19న) పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Punjab Elections 2022: పంచ నదుల పంజాబ్‌ పంచముఖ పోరులో.. ఎవరిది జోరు?
Punjab Political Parties
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 19, 2022 | 4:40 PM

Punjab Elections 2022: పంజాబ్ పంచముఖ పోరు కీలక ఘట్టానికి చేరింది. పంజాబ్ అంటేనే ఐదు నదులు ప్రవహించే ప్రాంతం అని అర్థం. అలాంటి చోట ఐదు రాజకీయ పార్టీలు, కూటములు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. 1966లో మూడు రాష్ట్రాలుగా విడిపోయి ప్రస్తుత పంజాబ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రధానంగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు శిరోమణి అకాలీదళ్ (SAD), కాంగ్రెస్ (Congress Party) మధ్య అధికారం మారుతూ వచ్చింది. ఎన్నికల బరిలోనూ ముఖాముఖ లేదా త్రిముఖ పోరు కనిపించేది. గత దశాబ్దకాలంలో కొత్త శక్తులకు పంజాబ్ ఆస్కారం కల్పించింది. దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, అకాలీలకు అదనంగా ఇప్పుడు మరో మూడు కొత్త శక్తులు ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), అకాలీదళ్-బీఎస్పీ కూటమి, బీజేపీ (BJP)- మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన కొత్త పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC) – అకాలీదళ్ (సంయుక్త్) కూటమి, రైతు ఉద్యమం నుంచి రైతులు నెలకొల్పిన ‘సంయుక్త్ సమాజ్ మోర్చా’ (SSM) ప్రధానంగా పోటీ పడుతూ పంచముఖ పోరుకు తెరతీశాయి.

గెలుపు కోసం అన్ని పార్టీలూ హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించాయి. విఫలమైన ప్రభుత్వంపై కోపాన్ని ప్రదర్శించేందుకు, ప్రత్యర్థికి ఓటేసి గెలిపిస్తూ వచ్చిన పంజాబ్ ఓటర్ల ఆలోచనాసరళిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి ఓటేస్తే తమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నది బేరీజు వేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీలోని ప్రధాన పార్టీల బలాలు, బలహీనతలను చూస్తే…

గెలుపు వాకిట్లో నాడు బోల్తా..

ప్రచారపర్వంలో ముందు వరుసలో దూసుకెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ 2017లో గెలుపు వాకిట్లో బోల్తా కొట్టి, ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైంది. మొత్తం 117 స్థానాల్లో కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందగా, ఆప్ 20 సీట్లకు, అకాలీ-బీజేపీ కూటమి 18 సీట్లకే పరిమితమయ్యాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న అకాలీదళ్-బీజేపీ కూటమిని 3వ స్థానానికి నెట్టి ద్వితీయ స్థానాన్ని చేరుకోగల్గినా, అధికార పీఠాన్ని అందుకోలేకపోవడానికి కేజ్రీవాల్ చేసిన రెండు తప్పిదాలే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2017లో రాష్ట్ర నాయకత్వాన్ని కేజ్రీవాల్ ఖరారు చేయలేకపోయారు. దాంతో కేజ్రీవాలే పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని చర్చ జరిగింది. ఇక్కడ స్థానికత అనేది కేజ్రీవాల్‌కు ప్రతికూలాంశమైంది. మరోవైపు ఖలిస్తానీ వేర్పాటువాద శక్తులను కలిసి మద్ధతు కోరినట్టు కేజ్రీవాల్‌పై ఆరోపణలు బలంగా వచ్చాయి. దాంతో ప్రజల కళ్ల ముందు నాటి వేర్పాటువాద, ఉగ్రవాద చీకటి రోజులు మెదిలాయి. ఈ రెండు తప్పిదాలు చేయకపోయి ఉంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఆనాడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదని చెబుతుంటారు.

ప్రస్తుత ఈ ఎన్నికల్లోనూ సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం సహా ప్రచారంలోనూ ముందంజలో ఉంది. 2014లో ఉత్తరాదిన మొత్తం మోదీ హవా నడిచిన సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో 4 పార్లమెంట్ స్థానాలు గెలుపొంది అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఆప్‌ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడ్డ “న భుక్కీ కో, న దారూకో, వోట్ దేంగే ఝూడూ కో” (డ్రగ్స్ కి కాదు, మద్యానికి కాదు, చీపురుకే వోట్ వేద్దాం) వంటి నినాదాలను పార్టీ మళ్లీ ఎత్తుకుంది. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ ఓటర్లను ఆలోచనలో పడేస్తోంది.

స్వయంకృతం.. కాంగ్రెస్‌కు శాపం..

దేశంలోనే అత్యధిక దళిత జనాభా కల్గిన పంజాబ్‌లో ఆ వర్గానికి చెందిన నేత చరణ్‌జీత్ సింగ్ ఛన్నీని ముఖ్యమంత్రిగా చేసి, తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలను మార్చేసింది. కానీ ఆ పార్టీని ఎప్పుడూ వెంటాడే శాపం అంతర్గత పోరు, గ్రూపు తగాదాలు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి మధ్య పోరు సాగుతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నన్ని రోజులూ ఆయనతో పేచీకోరు రాజకీయాలు చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఇప్పుడు చరణ్‌జీత్ సింగ్ చన్నీతోనూ అదే తరహా పోరు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠమే పరమావధిగా ఆయన చేస్తున్న రాజకీయం పార్టీకి అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను సాగనంపిన తీరు సైతం కాంగ్రెస్ పార్టీకి అపఖ్యాతి తెచ్చిపెట్టింది. ఎన్నికల్లో దళిత కార్డు మీద నమ్మకం పెట్టుకుని గెలుపుపై ఆశాభావంతో ఉంది.

బలం పుంజుకున్న అకాలీలు..

మాఫియా శక్తులపై ఊదాసీన వైఖరి, పాలనా వైఫల్యంతో చెడ్డ పేరు మూటగట్టుకున్న అకాలీలు గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడం, ప్రస్తుత ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో జట్టుకట్టడం ఆ పార్టీకి కొంత బలాన్ని అందించాయి. పైపెచ్చు అకాలీదళ్ శక్తిహీనమైనట్టుగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో ముఖ్యంగా మాల్వా ప్రాంతంలో తమ పట్టును కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం 1920లో ఏర్పాటై, దేశంలో కాంగ్రెస్ తర్వాత శతాబ్దకాలానికి పైగా ఘనమైన చరిత్రను కల్గిన శిరోమణి అకాలీదళ్ తమను అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని సంకేతాలిస్తోంది. అకాలీదళ్ 97 సీట్లలో, బీఎస్పీ 20 సీట్లలో పోటీ చేస్తున్నాయి.

బీజేపీ-కెప్టెన్ కూటమి..

వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలతో పంజాబ్ రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన బీజేపీ అసలు ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టగల్గుతుందా అన్న సందేహాం తొలుత అందరిలో తలెత్తింది. కానీ ఆ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, పార్టీ జాతీయ నాయకత్వం పెట్టిన ప్రత్యేక దృష్టి ఆ పార్టీని బరిలో నిలపగల్గింది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC), శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) పార్టీలు బీజేపీ నేతృత్వంలోని కూటమిలో ఉన్నాయి. బీజేపీ 72 సీట్లలో పోటీ చేస్తుండగా, పీఎల్సీ 30 చోట్ల, అకాలీ చీలిక పార్టీ 15 చోట్ల పోటీ చేస్తున్నాయి.

రైతుల రాజకీయ పోరు..

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాన్ని చేపట్టిన పంజాబ్ రైతు సంఘాలు రాజకీయ ప్రవేశం చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ‘సంయుక్త్ సమాజ్ మోర్చా’ (SSM) పేరుతో పోటీ చేస్తున్న ఈ కూటమిలో రైతు ఉద్యమ నేత గుర్నాం సింగ్ ఏర్పాటు చేసిన ‘సంయుక్త్ సంఘర్ష్ పార్టీ’ (SSP) భాగస్వామిగా ఉంది. ‘సంయుక్త్ సంఘర్ష్ పార్టీ’ 10 స్థానాల్లో తమకు కేటాయించిన కప్పు సాసర్ గుర్తుపై పోటీ చేస్తుండగా, మిగతా 107 సీట్లలో రైతు సంఘాల నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా వేర్వేరు గుర్తులపై బరిలో నిలిచారు. రైతు ఆందోళన సందర్భంగా రాష్ట్రంలోని వివిధ సంఘాల నుంచి విస్తృతంగా మద్ధతు సంపాదించుకున్న రైతు సంఘాలు, రాజకీయంలోకి అడుగుపెట్టాక ఎంతమేర ఆ తరహా మద్ధతు కూటగట్టుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతాలు, గ్రామీణ క్షేత్రాల్లో ఈ పార్టీ ఇతరుల విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అందరి చూపు.. ఆప్ వైపు..

పంజాబ్‌ ఎన్నికల బరిలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)నే టార్గెట్ చేశాయి. ప్రచార పర్వం ముగిసే సమయానికి ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా ఆరోపణాస్త్రాలతో విరుచుకుపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అధికారం అప్పగిస్తే రాష్ట్రం నాశనమవుతుందని అకాలీదళ్ అగ్రనేత, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీపై యాంటీ – పంజాబ్ అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేశారు. బీజేపీ అగ్రనేత, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం తన ప్రసంగాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేశారు. అసలు ఢిల్లీలో ఆప్ సాధించిన ఘనత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. పంజాబ్‌లో వేళ్లూనుకున్న డ్రగ్ మహమ్మారిని బీజేపీ మాత్రమే అంతం చేయగలగదని అన్నారు. బీజేపీ రాష్ట్ర నేత మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందువులు, సిక్కుల మధ్య అంతరం తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు వేర్పాటువాదుల సహాయాన్ని తీసుకునేందుకు సైతం కేజ్రీవాల్ సిద్ధపడ్డారని వచ్చిన వార్తలపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

అన్ని పార్టీలూ ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకోవడంతోనే ఆ పార్టీ బలమేంటో అందరికీ అర్థమవుతోంది. ఆరోపణలకు ధీటుగా బదులిస్తూ అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయని ఆప్ నేతలు విమర్శించారు. ఆప్‌ను ఎదుర్కోలేక మూడూ ఒక దగ్గరికి చేరి కుట్ర చేస్తున్నాయని నిందించారు. కేజ్రీవాల్ లక్ష్యంగా చేస్తున్న తప్పుడు ఆరోపణలు, విమర్శలే ఇందుకు నిదర్శనమని ఆప్ నేత రాఘవ్ చద్దా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రత్యర్థి పార్టీలు కేజ్రీవాల్‌ను నక్సలైటుగా, ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయని.. కానీ ఢిల్లీ ప్రజలు వారికి తమ ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “దేశంలోని అవినీతిపరులంతా మాకు వ్యతిరేకంగా గుమిగూడారు. ఈరోజు మేము ఢిల్లీలో 12,430 అత్యాధునిక తరగతి గదులను ప్రారంభించడం ద్వారా వారందరికీ తగిన సమాధానం ఇస్తున్నాం. ఈ అవినీతిపరులకు ఈ దేశం తలవంచదు. ఇప్పుడు దేశం ముందుకు సాగుతుంది. బాబా సాహిబ్, భగత్ సింగ్ కలలు నెరవేరుతాయి” అంటూ ట్వీట్ చేశారు. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు వరకు సాగుతున్న ఈ మాటల యుద్ధం సంగతెలా ఉన్నా, పంజాబ్ ఓటర్లు మాత్రం మాదక ద్రవ్యాల ఊబి నుంచి, నిరుద్యోగ సమస్య నుంచి తమను బయటపడేసే సర్కారు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read..

Hyderabad: కొడుకు డ్రైవింగ్ సరదా కొంపముంచింది.. బ్రేక్ అనుకుని క్లచ్ తొక్కడంతో కారు ప్రమాదం

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!