Akash Missile System: ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం.. పాకిస్తాన్‌కు కాళరాత్రే
మన దేశీయ ఆయుధాలతో పాకిస్తాన్‌కి బొమ్మ కనపడ్డం మొదలైంది. ఫుల్‌స్కేల్ యుద్ధం మొదలవకముందే పాకిస్తాన్ చేతులెత్తేసే స్థాయికి తీసుకొచ్చిన ఘనత మాత్రం మన ఆకాశ్ మిస్సైల్‌దే. ఎస్... స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ.. పాక్ దాడులను సమర్ధంగా తిప్పికొడుతోంది.

మన దేశీయ ఆయుధాలతో పాకిస్తాన్‌కి బొమ్మ కనపడ్డం మొదలైంది. ఫుల్‌స్కేల్ యుద్ధం మొదలవకముందే పాకిస్తాన్ చేతులెత్తేసే స్థాయికి తీసుకొచ్చిన ఘనత మాత్రం మన ఆకాశ్ మిస్సైల్‌దే. ఎస్… స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ.. పాక్ దాడులను సమర్ధంగా తిప్పికొడుతోంది. భారత లక్ష్యాలపై పాక్ చేసే కుయుక్తులను భగ్నం చేయడంలో వార్ జోన్‌లో కీలకపాత్ర పోషిస్తోంది ఆకాశ్ మిస్సైల్. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థతో పాకిస్తాన్ దాడులను విజయవంతంగా నిరోధిస్తోంది మన ఆర్మీ. పాకిస్తాన్ సరిహద్దు పొడవునా ఆకాశ్ క్షిపణులను మోహరించింది.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో మైలురాయిగా నిలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, ఫైటర్ జెట్లని కూల్చేస్తోంది మన ఆకాశ్ క్షిపణి. డీఆర్‌డీవో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి కీలక సమయంలో తన తడాఖా చూపిస్తోంది. భూమి మీద నుంచి నేరుగా లక్ష్యాలను ఛేదించడమే కాదు.. ఏకకాలంలో మల్టిపుల్ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్ మిస్సైల్ స్పెషాలిటీ.
పాక్ దాడిని ముందే పసిగట్టిన భద్రతా బలగాలు సరిహద్దుల్లో ఆకాశ్ మిస్సైల్స్‌ని మోహరించాయి. రియల్ టైమ్ దాడులను వెంటనే గుర్తించి ప్రత్యర్థి ఎత్తులను ఆకాశ్ మిస్సైల్ సమర్ధంగా తిప్పికొట్టింది. నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడిని తిప్పికొట్టడంలో ఆకాశ్ క్షిపణులదే కీలకపాత్ర. 25 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు ఈ మిడిల్ రేంజ్ మిస్సైల్. డ్రోన్ అటాక్‌ని నిర్వీర్యం చేయడంలో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వందశాతం స్ట్రైక్ రేట్ అందుకుంటోంది మన ఆర్మీ.
ఆత్మనిర్బర్ భారత్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఆకాశ్ మిస్సైల్‌కి రూపకల్పన చేసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఇందులో పాలుపంచుకున్నాయి. 30 కిలోమీటర్ల దూరంలో 18వేల మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానాలను ఈ క్షిపణి ఛేదించగలదు. గాల్లో ఎగిరే యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, నింగినుంచి నేలపైకి ప్రయోగించే క్షిపణులను నిర్వీర్యం చెయ్యగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. దీన్ని భారత సైన్యం, భారతీయ వాయుసేనల్లో మోహరించారు.
ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచర్‌లో మూడేసి క్షిపణులుంటాయి. ఆకాశ్ క్షిపణి ఒక్కోటీ 60 కిలోల వార్‌హెడ్‌ని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తేలిగ్గా ప్రయాణించగల ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఒకచోటినుంచి మరోచోటికి తరలించడం కూడా తేలికే. ఆకాశ్‌ని మొదట గగన రక్షక వ్యవస్థగా రూపొందించినా, తర్వాత క్షిపణి రక్షక వ్యవస్థగా కూడా పరీక్షించారు. 2వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో గగన తలాన్ని రక్షించే సత్తా ఉంది మన ఆకాశ్‌కి. గంటకు 4వేల 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది మన ఇండియన్ మిస్సైల్.
ఆకాశ్ క్షిపణి అభివృద్ధికి వెయ్యికోట్లు ఖర్చుపెట్టింది మన రక్షణశాక. ఇలాంటి క్షిపణుల కోసం ఇతర దేశాలు పెట్టిన ఖర్చులో ఇది పదో వంతు మాత్రమే. ఎంకే, ఎంకే టూ, ఎంజీ.. మూడు వేరియంట్లలో 30నుంచి 80కిలోమీటర్ల రేంజ్‌ని ఛేదించేలా ఆకాశ్ మిస్సైల్‌ని అభివృద్ధిచేశారు మన శాస్త్రవేత్తలు. 2023 డిసెంబరులో ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ప్రయోగించిన నాలుగు క్షిపణులు 25కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న నాలుగు లక్ష్యాలను ఢీకొట్టేలా డీఆర్‌డీవో చేసిన ప్రయోగం విజయవంతమైంది. అప్పుడే ఆకాశ్ దమ్మేంటో తెలిసింది.
SA-6ని పోలి ఉంటుంది ఆకాశ్ క్షిపణి డిజైన్. ఒక్కో క్షిపణి ధర 2 కోట్లకు పైనే. అయితే పశ్చిమదేశాల మిస్సైల్స్ ధరలో ఇది సగంకంటే తక్కువే. 2012 మే 24 న ఆకాశ్ సాంకేతికని, సామర్థ్యాన్ని విజయవంతంగా తిరిగి పరీక్షించారు. 2012 మార్చి 3న హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో క్షిపణిని అధికారికంగా వాయుసేనలో చేర్చుకున్నారు. మొదట ఎయిర్‌ఫోర్స్‌లో మోహరించిన ఆకాశ్ మిస్సైల్.. పదేళ్లక్రితం ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలో చేరింది. 99శాతం.. ఎస్ నైంటీ నైన్ పర్సెంట్ కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంది మన మేడిన్ ఇండియా మిస్సైల్‌కి. అందుకే పాకిస్తాన్ గుండెల్లోకి దూసుకుపోతోంది ఆకాశ్ క్షిపణి