AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పీటల మీది పెళ్లిని ఆపేసిన రసగుల్లాలు… వరుడి విషయం తెలిసి పెళ్లికూతురు షాక్‌

వంద అబద్దాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలంటారు. కానీ, వాస్తవాలు దాయకూడదు అనే విషయం మరిచి పెళ్లి చేయచూశారు. ఆఖరికి రసగుల్లాలు పీటల మీద పెళ్లిని ఆపేశాయి. ఈ సంఘటన బీహార్‌లోని నలందలో చోటు చేసుకుంది. పెళ్లి వేదిక మీద వరుడు అందరి ముందు చేసిన ఓ వధువు షాక్‌కు గురయింది. ఈ వరుడు వద్దంటే వద్దంటూ ఏకంగా...

Viral News: పీటల మీది పెళ్లిని ఆపేసిన రసగుల్లాలు... వరుడి విషయం తెలిసి పెళ్లికూతురు షాక్‌
Marriage Rasagulla
K Sammaiah
|

Updated on: May 09, 2025 | 8:26 PM

Share

వంద అబద్దాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలంటారు. కానీ, వాస్తవాలు దాయకూడదు అనే విషయం మరిచి పెళ్లి చేయచూశారు. ఆఖరికి రసగుల్లాలు పీటల మీద పెళ్లిని ఆపేశాయి. ఈ సంఘటన బీహార్‌లోని నలందలో చోటు చేసుకుంది. పెళ్లి వేదిక మీద వరుడు అందరి ముందు చేసిన ఓ వధువు షాక్‌కు గురయింది. ఈ వరుడు వద్దంటే వద్దంటూ ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. పెళ్లి చేసుకోమని వరుడు వేడుకుంటున్నా ససేమిరా అంది. చివరికి వధువు లేకుండానే వరుడు వివాహ ఊరేగింపును ఖాళీ చేతులతో వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది.

సిలావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూయ్ గ్రామంలో బుధవారం రాత్రి వివాహ ఊరేగింపు వైభవంగా సాగింది. వధువు, వరుడి కుటుంబ సభ్యులు వివాహ ఊరేగింపుకు స్వాగతం పలికారు. తరువాత పూలమాల వేసే వంతు వచ్చింది. వధువు వరుడికి దండలు వేసిన వెంటనే, వారిద్దరికీ స్వీట్లు తినిపించారు. ఈ క్రమంలో వరుడు చేసిన పనికి వధువు ఆశ్చర్యానికి గురైంది.

స్వీట్లు తినే క్రమంలో వరుడు రెండు చేతులతో రసగుల్లాలు తీసుకొని తినడం ప్రారంభించాడు. ఇది చూసి పెళ్లికూతురు నిర్ఘాంతపోయింది. వరుడు మానసిక రోగి అని ఆమెకు తెలిసింది. వెంటనే పెళ్లికూతురు కోపంగా పెళ్లి వేదిక దిగి వచ్చింది. ఇలాంటి వ్యక్తిని ససేమిరా పెళ్లి చేసుకోనని చెప్పింది. అయితే వివాహాన్ని విచ్ఛిన్నం చేయవద్దని వరుడు ఆమెను వేడుకున్నా వినిపించుకోలేదు. వరుడి కుటుంబం కూడా వధువును ఒప్పించడానికి ప్రయత్నించినా వధువు ఒప్పుకోలేదు.

పెళ్లి సంబంధం కుదిరినప్పుడు, వరుడు మానసిక అనారోగ్యంతో ఉన్నాడని మాకు చెప్పలేదని వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి క్షణంలోనైనా వరుడి మానసిక స్థితి తెలియడంతో తమ కూతురికి మంచి జరిగిందని చెప్పారు.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్