Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India Flight Crash Live: ప్రమాదస్థలి పరిస్థితి దయనీయం ఉంది: ప్రధాని మోదీ

గురువారం (జూన్ 12) మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రయాణీకుల విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 కుప్ప కూలిపోయింది. మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న వెంటనే కూలిపోయింది. టేకాఫ్‌ తీసుకున్న వెంటనే మేఘానీ ప్రాంతంలో ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో 241మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు సమాచారం.

Air India Flight Crash Live: ప్రమాదస్థలి పరిస్థితి దయనీయం ఉంది: ప్రధాని మోదీ
Air India Flight Crash
Balaraju Goud
| Edited By: TV9 Telugu|

Updated on: Jul 03, 2025 | 3:34 PM

Share

గురువారం (జూన్ 12) మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రయాణీకుల విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 కుప్ప కూలిపోయింది. ఇందుకు సఃంబంధించి భయానక చిత్రాలు బయటకు వస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతంలో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెలులుండగా. విమానంలో 241 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అవుతుండగా సమీపంలోని భవనం లేదా గోడను ఢీకొట్టి కూలిపోయింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విమానాశ్రయ సరిహద్దు సమీపంలోనే విమానం కూలిపోయింది.బయటపడిన ప్రాథమిక చిత్రాలలో, విమానం ముక్కలైపోయినట్లు కనిపిస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

విమానం ఒక రెక్క విరిగి పడిపోయినట్లు చిత్రంలో కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం, మంటలు కొంతవరకు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానం విమానాశ్రయం నుండి బయలుదేరుతోంది. చుట్టూ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘోర ప్రమాదాన్ని చూసి ప్రజలు భయపడి అక్కడికి పరుగులు తీశారు. విమానం పూర్తిగా దెబ్బతింది. విమానంలోని చాలా భాగాలు కాలి బూడిదయ్యాయి. విమానం కూలిపోయిన భవనం కూడా దెబ్బతింది.

ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన వెలువడింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ వెళ్తున్న AI171 విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం, ఈ సంఘటన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా https://www.airindia.com/ , సోషల్ మీడియా X హ్యాండిల్ వేదికగా మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపింది.

అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత

ర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం వెలుపల కూలిపోయింది. దీంతో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయానికి ప్రయాణించే ముందు తాజా అప్‌డేట్స్ కోసం ప్రయాణీకులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.

ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించింది అని ప్రధాని అన్నారు. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్న మంత్రులు అధికారులతో మాట్లాడుతున్నానని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Jun 2025 03:02 PM (IST)

    దర్యాప్తు కోసం భారత్‌కు బ్రిటన్ సంస్థ

    భారీ విమాన ప్రమాదంపై భారత్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకునేందుకు బ్రిటన్‌కు చెందిన ‘ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్’ (ఏఏఐబీ) బృందం భారత్‌కు రానుంది. పౌర విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో ఏఏఐబీకి ప్రత్యేక నైపుణ్యం ఉంది. భారతదేశ నేతృత్వంలో జరిగే ఈ దర్యాప్తునకు తమ బృందం సహాయ సహకారాలు అందిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ జాతీయులు, ఒక కెనడా పౌరుడు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

  • 13 Jun 2025 01:34 PM (IST)

    ప్రమాదస్థలి దగ్గర పరిస్థితి దయనీయం ఉంది: మోదీ

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ విచారణం వ్యక్తం చేశారు. ఇంతమంది ఈ ప్రమాదంలో చనిపోవడం చెప్పలేని విషాదమన్నారు. తమ వారికి కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. వారి బాధను అర్థం చేసుకోగలం.. ప్రమాదస్థలి దగ్గర పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు, బృందాలతో మాట్లాడానని అన్నారు.

  • 13 Jun 2025 12:05 PM (IST)

    మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు

    డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలను నిర్వహించి వారిని గుర్తించనున్నారు.

  • 13 Jun 2025 11:31 AM (IST)

    డీఎన్‌ఏ కోసం శాంపిళ్ల సేకరణ

    విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు.

  • 13 Jun 2025 10:43 AM (IST)

    బ్లాక్‌ బాక్స్‌ లభించింది.. డేటా డీకోడ్‌..దర్యాప్తు మరింత వేగవంతం

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం అవుతోంది. విమానంలో ఉండే బ్లాక్‌ బాక్స్‌ను రివకరీ చేసుకున్న డీజీసీఏ.. డేటాను డీకోడ్‌ చేస్తోంది. ఇంజిన్‌లు ఫెయిల్‌ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు ముందుగా నిర్ధారించిన అధికారులు.. బ్లాక్‌బాక్స్‌ డేటాను పరిశీలిస్తున్నారు.

  • 13 Jun 2025 09:46 AM (IST)

    క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగిన ఘటనను పరిశీలించిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

  • 13 Jun 2025 09:14 AM (IST)

    ఘటన స్థలంలో ప్రధాని మోదీ

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు.

  • 13 Jun 2025 09:12 AM (IST)

    గుర్తు పట్టలేని విధంగా మృతదేహాలు

    విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి దేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించిన వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు కొనసాగుతోంది.

  • 13 Jun 2025 08:38 AM (IST)

    ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతి చెందిన తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయిన తర్వాతే మృతుల వివరాలు రానున్నాయి.

  • 13 Jun 2025 08:35 AM (IST)

    అహ్మదాబాద్‌కు చేరుకున్న మోడీ

    ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. కాసేపట్లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.

  • 13 Jun 2025 07:47 AM (IST)

    ప్రాథమిక నివేదిక

    విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ప్రాథమిక నివేదికను సిద్ధం చేయనున్నారు అధికారులు. ఇంజిన్లు ఫెయిల్‌ కావడంతోనే ప్రమాదం జరిగిందని ఇప్పటికీ అధికారులు గుర్తించారు. ఇంజిన్లు పని చేయకపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

  • 13 Jun 2025 07:45 AM (IST)

    డీజీసీఏ దర్యాప్తు

    ప్రమాద స్థలాన్ని ఎయిరిండియా సీఈవో విల్సన్‌ పరిశీలించారు. విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తు చేస్తోంది. రాత్రంతా ఘటన స్థలం దగ్గర డీజీసీఏ సోదాలు నిర్వహించింది. ప్రమాదం జరిగిన తీరుపై డీజీసీఏ బృందం విశ్లేషణ కొనసాగించింది.

  • 13 Jun 2025 07:42 AM (IST)

    డేటా కలెక్ట్‌ చేస్తోంది

    ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. ఇప్పటికే DGCA దర్యాప్తు చేస్తోంది. డేటా కలెక్ట్‌ చేస్తోంది. రెండు బ్లాక్‌బాక్స్‌లు ప్రమాదం గుట్టు విప్పబోతున్నాయి. విమానంలో వెనకభాగంలో ఉండే ఒక బ్లాక్‌బాక్స్‌ లభ్యమైంది. విమానం ముందు ఉండే మరో బ్లాక్స్‌బాక్స్‌ కోసంఅన్వేషిస్తున్నారు. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో బ్లాక్‌బాక్స్‌ చెప్పబోతోంది.

  • 13 Jun 2025 06:57 AM (IST)

    అహ్మదాబాద్‌కు మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. విమాన కూలిన ప్రమాదంలో 241 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ పరిశీలించనున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోనున్నారు.

  • 13 Jun 2025 06:24 AM (IST)

    బ్లాక్ బాక్స్‌

    అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాలంటే కీలక సాక్ష్యం బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్‌లోని డేటాను విశ్లేషించడం ద్వారా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

  • 12 Jun 2025 07:43 PM (IST)

    ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందించింది. బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని టాటా సన్స్‌ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామన్నారు. దాంతో పాటు బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని పునర్నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.

  • 12 Jun 2025 07:38 PM (IST)

    ఎయిర్ ఇండియాకి 2 నెలల్లో 15 నోటీసులు

    ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. గడిచిన 2 నెలల్లో ఆ సంస్థకు 15 షోకాజ్ నోటీసులు పంపితే.. ఒక్క దానిపై కూడా స్పందించలేదని పేర్కొంది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనపై విచారణ జరిపేందుకు DGCA ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఎయిర్ ఇండియా CEOకి సమన్లు కూడా జారీ చేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

  • 12 Jun 2025 07:34 PM (IST)

    టేకాఫ్‌ అయిన 30 సెకన్లకు విమానంలో పేలుడుః రమేశ్

    11A సీటులో కూర్చున్న రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్‌ పోలీసు కమిషనర్‌ జీఎస్ మాలిక్ ధృవీకరించారు. ప్రమాదం తరువాత స్వల్ప గాయాలతో బయటపడ్డ రమేశ్‌, నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చాడు. ప్రస్తుతం అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే టేకాఫ్‌ అయిన తరువాత 30 సెకన్లకు విమానంలో పేలుడు సంభవించినట్లు రమేశ్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.

  • 12 Jun 2025 07:25 PM (IST)

    మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్

    Ramesh

    Ramesh

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అద్భుతం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. “పోలీసులు 11A సీటులో ప్రాణాలతో బయటపడిన ఒకరిని కనుగొన్నారు, ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని రమేష్  విశ్వాస్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరణాల సంఖ్య గురించి ఇంకా ఏమీ చెప్పలేమని, విమానం నివాస ప్రాంతంలో కూలిపోవడంతో మరణాల సంఖ్య పెరగవచ్చు.” అని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ GS మాలిక్  తెలిపారు.

  • 12 Jun 2025 07:20 PM (IST)

    ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు మరణించారు.

  • 12 Jun 2025 07:18 PM (IST)

    ప్రమాదస్థలికి రామ్ మోహన్ నాయుడు

    విమాన ప్రమాదం తర్వాత పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. విమాన ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతానికి మృతుల సంఖ్య చెప్పడం కష్టం. బాధిత కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

  • 12 Jun 2025 07:15 PM (IST)

    మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి

    గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆయన మరణాన్ని ధృవీకరించారు.

  • 12 Jun 2025 07:05 PM (IST)

    విచారం వ్యక్తం చేసిన కెనడా ప్రధాని

    అహ్మదాబాద్‌లో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన వార్త విని షాక్ అయ్యానని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒక కెనడియన్ కూడా ఉన్నారు. విమానంలో ఉన్న వారందరి కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నానని సోషల్ మీడియా వేదిక కెనడా ప్రధాని మార్క్ కార్నీ కెనడియన్ పేర్కొన్నారు. ఈ విషాదానికి సంబంధించి క్రమం తప్పకుండా అప్‌డేట్స్ వస్తున్నాయి” అని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ట్వీట్ చేశారు.

  • 12 Jun 2025 06:32 PM (IST)

    50మంది స్థానికులకు గాయాలు!

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై గుజరాత్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధనంజయ్ ద్వివేది కీలక ప్రకటన చేశారు. విమానం కూలిపోయిన ప్రాంత నివాసితులు కూడా గాయపడ్డారని అన్నారు. సుమారు 50 మంది గాయపడిన వారిని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వారికి ఉత్తమ చికిత్స అందిస్తున్నారని ఆయన అన్నారు.

  • 12 Jun 2025 06:30 PM (IST)

    మృతదేహాల గుర్తింపు ప్రక్రియ

    మృతదేహాలను గుర్తించడానికి DNA నమూనాలను అందించాలని గుజరాత్ ప్రభుత్వం విమానంలో ఉన్న వ్యక్తుల బంధువులకు విజ్ఞప్తి చేసింది. ప్రమాదం చాలా భయంకరంగా ఉండటంతో చాలా మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. “బిజె మెడికల్ కాలేజీలో డిఎన్ఎ పరీక్షలకు ఏర్పాట్లు చేయడం జరిగింది. విమాన ప్రయాణీకుల కుటుంబాలు, సన్నిహితులు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు, పిల్లలు, వారి నమూనాలను బిజె మెడికల్ కాలేజ్‌లో సమర్పించాలని అభ్యర్థించారు. తద్వారా బాధితులను త్వరగా గుర్తించవచ్చు” అని గుజరాత్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

  • 12 Jun 2025 06:22 PM (IST)

    చాలా బాధపడ్డానుః కోహ్లీ

    ఈ ప్రమాదం పట్ల టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించారు. చాలా బాధపడ్డానని సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానని కోహ్లీ రాశారు.

  • 12 Jun 2025 06:21 PM (IST)

    సంతాపం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ

    ఈ ప్రమాదం అందరినీ కదిలించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి సామాన్యుడి వరకు అందరూ ఈ ప్రమాదం పట్ల బాధపడ్డారు. భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ ఈ సంఘటనను హృదయ విదారకంగా అభివర్ణించారు.

  • 12 Jun 2025 06:15 PM (IST)

    విమాన ప్రమాదంపై పాకిస్తాన్ స్పందన ఇదే!

    విమాన ప్రమాదంపై పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ స్పందించారు. ఈ విషాద సంఘటన వార్త విని తాను బాధపడ్డానని బిలావల్ భుట్టో అన్నారు. “భారత ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

  • 12 Jun 2025 06:11 PM (IST)

    ‘మాజీ సీఎం రూపానీ సహా ఎవరూ బయటపడలేదు’: సీపీ

    విమాన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్‌ మాలిక్ అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. విమానం నివాస ప్రాంతంలో కూలిపోయినందున, కొంతమంది స్థానికులు కూడా చనిపోయి ఉండవచ్చని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.  విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులందరూ మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది.

  • 12 Jun 2025 06:11 PM (IST)

    విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరంః పవన్

    అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నామన్నారు. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

  • 12 Jun 2025 05:51 PM (IST)

    తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై విచారకరం అని చంద్రబాబు అన్నారు. ఈ ఘోర దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

  • 12 Jun 2025 05:43 PM (IST)

    విమాన ప్రమాదంలో 242 మంది మృతి

    అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని BJ మెడికల్ కాలేజి హాస్టల్ భవనాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 242 మంది మృతి చెందినట్లు అహ్మదాబాద్‌ పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్‌ ప్రకటించారు. ప్రమాదం తీవ్రతతో మాంసపు ముద్దలుగా దేహాలు పడి ఉన్నాయన్నారు. ఇప్పటికి సిటీ సివిల్ ఆస్పత్రికి 100కిపైగా మృతదేహాలు తరలించినట్లు సీపీ తెలిపారు. మరణించిన వారిలో 169 భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చు్గీస్ పౌరులు, ఒకరు కెనడాకు చెందిన వ్యక్తి ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు ఫైలట్స్, 10 ఎయిర్ హోస్టర్స్ ఉన్నట్లు సమాచారం.

  • 12 Jun 2025 05:36 PM (IST)

    చివరి నిమిషంలో మే డే కాల్ చేసిన ఫైలట్

    ఎయిర్ ఇండియా విమానం పైలట్ సుమిత్ సబర్వాల్ చివరి నిమిషంలో మే డే కాల్ చేశాడు. ఇది అంతర్జాతీయ డిస్ట్రెస్ కాల్, విమానం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అత్యవసర సహాయం అవసరమైనప్పుడు పైలట్ దీనిని పంపుతాడు. “మే డే” అనే పదం ఫ్రెంచ్ పదం “మైడెస్” నుండి వచ్చింది. దీని అర్థం “నాకు సహాయం చేయి”. ఇది మూడుసార్లు పునరావృతమవుతుంది. “మే డే మే డే మే డే”.

  • 12 Jun 2025 05:33 PM (IST)

    బంగ్లాదేశ్ భారత ప్రజలకు అండగా నిలుస్తుందిః మహ్మద్ యూనస్

    “అహ్మదాబాద్‌లో 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషాద సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతులందరికీ, వారి కుటుంబాలకు మేము ప్రార్థనలు చేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో బంగ్లాదేశ్ భారత ప్రజలకు మరియు ప్రభుత్వానికి సంఘీభావంగా నిలుస్తుంది” అని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ అన్నారు.

  • 12 Jun 2025 05:32 PM (IST)

    భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

    విమాన ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటన చేశారు. “అహ్మదాబాద్‌లో జరిగినది చాలా విషాదకరమైన ప్రమాదం. మేము చాలా మందిని కోల్పోయాము. అనేక మంది విదేశీయులతో సహా ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. సంబంధిత విభాగాల నుండి మీకు మరిన్ని అప్‌డేట్స్ అందుతాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖచ్చితమైన వివరాలు వెలువడటానికి మనం మరికొంత సమయం వేచి ఉండాలి” అని అన్నారు.

  • 12 Jun 2025 05:30 PM (IST)

    పుతిన్ సంతాప సందేశం

    గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ప్రయాణీకుల విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు సంతాప సందేశం పంపారు. “గౌరవనీయులైన ప్రధాన మంత్రి, అహ్మదాబాద్‌లో జరిగిన ప్రయాణీకుల విమాన ప్రమాదం విషాదకరమైన పరిణామాలకు దయచేసి నా ప్రగాఢ సంతాపాన్ని అంగీకరించండి. ఈ విపత్తులో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

  • 12 Jun 2025 05:22 PM (IST)

    ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య

    కొద్ది రోజుల క్రితమే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జూన్ 7న ఢిల్లీ నుంచి పారిస్ వెళ్తున్న విమానంలో సమస్య తలెత్తడంతో ఎలక్ట్రిక్ ఎర్రర్, కాలిన వాసన రావడంతో షార్జా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. తక్షణమే పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో నాడు ప్రమాదం తప్పింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విమానం కూడా ఎయిర్ ఇండియా (AI 143) వినియోగించిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ రకమే కావడం విశేషం.

  • 12 Jun 2025 05:20 PM (IST)

    విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభం

    అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో నాలుగు గంటల పాటు విమాన సేవలు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో విమానాల కార్యకలాపాలు కొనసాగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

  • 12 Jun 2025 05:16 PM (IST)

    తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇరాన్

    అహ్మదాబాద్‌లో జరిగిన ప్రయాణీకుల విమాన ప్రమాదంపై న్యూఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం తీవ్ర విచారం, హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేసింది. ‘‘భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు, ముఖ్యంగా బాధితుల కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఈ హృదయ విదారక సంఘటనలో గాయపడిన వారందరూ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ దుఃఖ సమయంలో మేము భారత ప్రజలతో నిలబడతాము.” అంటూ పేర్కొన్నారు.

  • 12 Jun 2025 05:09 PM (IST)

    విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఇది హృదయ విదారకమైన విషాదం. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వర్ణించలేని ఈ దుఃఖ సమయంలో దేశం బాధిత కుటుంబాలకు తోడుగా నిలుస్తుంది” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

  • 12 Jun 2025 05:03 PM (IST)

    వీలైనన్ని ఎక్కువ మంది ప్రాణాలు దక్కాలని ప్రార్థనః జెలెన్‌స్కీ

    విమాన ప్రమాద ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. “భారతదేశంలో ప్రయాణీకుల విమాన ప్రమాదం గురించి భయంకరమైన వార్త అందింది. ఈ విషాదకరమైన రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారతదేశ ప్రజలందరికీ నా ప్రగాఢ సానుభూతి. భారతదేశం, యుకె, పోర్చుగల్, కెనడాలోని బాధితులందరి బంధువులు, సన్నిహితులకు మా సంతాపం. ఈ విషాదకరమైన రోజున దుఃఖాన్ని పంచుకుంటాము. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడబడాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మనమందరం ప్రార్థిస్తున్నాము” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.

  • 12 Jun 2025 05:00 PM (IST)

    ఆసుపత్రికి చేరుకున్న గుజరాత్ సీఎం

    గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోని అసర్వా సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. అక్కడే వైద్యులతో సమీక్ష నిర్వహించిన కీలక సూచనలు చేశారు.

  • 12 Jun 2025 04:53 PM (IST)

    బ్లాక్‌ కలర్‌ డీపీ పెట్టిన ఎయిర్‌ ఇండియా

    విమాన ప్రమాదం తర్వాత ఎయిర్‌ఇండియా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తమ సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో నల్లరంగు డీపీలను అప్‌డేట్‌ చేసింది ఎయిర్‌ఇండియా. ఎక్స్‌తోపాటు.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ బ్లాక్‌ కలర్‌ డీపీలను పెట్టింది ఎయిర్‌ ఇండియా. 1985 తర్వాత ఎయిర్‌ఇండియా విమానయాన సంస్థకు అతిపెద్ద క్రాష్‌ ఇది. ప్రమాదం సమయంలో 240మంది ప్రయాణికులు పది మంది క్యాబిన్‌ క్రూ.. ఇద్దరు పైలట్లు ఉన్నారు. ప్రమాదానికి ముందు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏటీసీ టవర్‌కు మేడే కాల్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

    Air India

    Air India

  • 12 Jun 2025 04:51 PM (IST)

    విచారం వ్యక్తం చేసిన బ్రిటిష్ ప్రధాన మంత్రి

    అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

  • 12 Jun 2025 04:49 PM (IST)

    ‘హృదయ విదారకరం’: రాహుల్ గాంధీ

    అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను రాహుల్ గాంధీ “హృదయ విదారకం” అని అభివర్ణించారు. బాధితులకు సంతాపం తెలిపారు. “ప్రయాణీకులు, సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహించలేనిది” అని ఆయన అన్నారు. “అధికారు యంత్రంగం అత్యవసరంగా రక్షణ, సహాయ చర్యలు ముమ్మరం చేయాలి. ప్రతి ప్రాణం ముఖ్యం, ప్రతి సెకను కూడా ముఖ్యం. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయం చేయడానికి తమ వంతు కృషి చేయాలి.” అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

  • 12 Jun 2025 04:45 PM (IST)

    విమాన ప్రమాదం బాధాకరంః సోనియా గాంధీ

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ స్పందించారు. “అహ్మదాబాద్‌లో జరిగిన విషాద విమాన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధపెట్టింది. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. వెలుగులోకి వచ్చిన దృశ్యాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. దేశం మొత్తం దుఃఖిస్తోంది.. వారి కోసం ప్రార్థిస్తోంది.” అంటూ సోనియా గాంధీ సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు.

  • 12 Jun 2025 04:34 PM (IST)

    స్పెషల్ రైళ్ల ఏర్పాటు

    అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత, పశ్చిమ రైల్వే విపత్తు నిర్వహణ బృందం రాష్ట్రంతో చురుగ్గా సమన్వయం చేసుకుంటూ, సంఘటన స్థలంలో సహాయ చర్యలలో పూర్తిగా నిమగ్నమైంది. పశ్చిమ రైల్వే వైద్య బృందం, RPF సిబ్బందిని కూడా సహాయక చర్యలలో సహాయం చేయడానికి ఇప్పటికే నియమించారు. దీంతో పాటు, పశ్చిమ రైల్వే డిమాండ్ ఆధారంగా అహ్మదాబాద్ నుండి అదనపు రైళ్లను నడుపుతుంది. ప్రస్తుతం, అహ్మదాబాద్ నుండి ముంబైకి ఒక రైలు, ఢిల్లీకి ఒక రైలును నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది.

  • 12 Jun 2025 04:32 PM (IST)

    విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో.. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

  • 12 Jun 2025 04:18 PM (IST)

    విమాన ప్రమాదం వెనుక ఉగ్రదాడి కోణం ?

    అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన 5 నిమిషాలకే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది. మే డే అన్న సమాచారం తర్వాత ATC తో విమాన సంబంధాలు కోల్పోయింది. పహెల్గామ్ ఘటన తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రవాద కోణం దాగి ఉందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే దర్యాప్తు కోసం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డైరెక్టర్ జనరల్ అహ్మదాబాద్‌కు బయలుదేరారు.

  • 12 Jun 2025 04:14 PM (IST)

    ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించింది అని ప్రధాని అన్నారు. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్న మంత్రులు అధికారులతో మాట్లాడుతున్నానని వెల్లడించారు.

  • 12 Jun 2025 04:08 PM (IST)

    కష్ట సమయాల్లో భారతీయులకు ఉంటాంః జర్మనీ

    “అహ్మదాబాద్ నుండి బయలుదేరిన తర్వాత ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి వార్తలు, చిత్రాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. మాకు పూర్తి వివరాలు అందలేదు, కానీ ఈ క్లిష్ట సమయంలో తమవారి భద్రత కోసం ఆశిస్తున్న భారతీయ స్నేహితుల కోసం నా ప్రార్థనలు ఉన్నాయి” అని జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్ అన్నారు.

  • 12 Jun 2025 04:05 PM (IST)

    యుకె ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ జారీ

    అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యామని యూకే ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవాలను వెంటనే నిర్ధారించి, బాధిత కుటుంబాలకు సహాయం అందించడానికి UK భారతదేశంలోని స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోందని తెలిపింది. కాన్సులర్ సహాయం అవసరమైన లేదా వారి స్నేహితులు, కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్న బ్రిటిష్ పౌరులు 020 7008 5000 కు కాల్ చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది.

  • 12 Jun 2025 04:05 PM (IST)

    విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటన

    అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ప్రయాణికులు, వారి కుటుంబాలతో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.

  • 12 Jun 2025 04:00 PM (IST)

    విమాన ప్రమాదాన్ని మాటల్లో వర్ణించలేంః అమిత్ షా

    అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదాన్ని మాటల్లో వర్ణించలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. విపత్తు నివారణ బృందాన్ని వెంటనే ప్రమాద స్థలానికి పంపామన్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడానని అమిత్ షా తెలిపారు.

  • 12 Jun 2025 03:58 PM (IST)

    మృతుల్లో 20 మంది విద్యార్థులు..?

    బిజె మెడికల్ కాలేజీ బాలుర హాస్టల్‌లో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 మంది ప్రయాణికులు మరణించి ఉంటారని భావిస్తున్నారు.

  • 12 Jun 2025 03:39 PM (IST)

    కొనసాగుతున్న సహాయక చర్యలు

    గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మేఘనాని నగర్ ప్రాంతంలో విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారి జయేష్ ఖాదియా తెలిపారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపామని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు.

  • 12 Jun 2025 03:34 PM (IST)

    ఎయిర్ ఇండియా హెల్ప్‌లైన్ నంబర్

    అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారి సమాచారం కోసం ఎయిర్ ఇండియా హెల్ప్‌లైన్ నంబర్ 1800-5691-444ను ప్రకటించింది.

  • 12 Jun 2025 03:33 PM (IST)

    ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు?

    అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానంలో 169 మంది భారతీయులు ఉన్నారు. వీరితో పాటు 53 మంది బ్రిటన్, ఒకరు కెనడియన్, ఒకరు పోర్చుగీస్ ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను తరలించడానికి భారత రైల్వే ప్రత్యేక వందే భారత్ రైలును నడపడానికి సన్నాహాలు చేస్తోంది.

  • 12 Jun 2025 03:29 PM (IST)

    డాక్టర్ల హాస్టల్‌లోకి దూసుకెళ్లిన విమానం

    ప్రాథమిక సమాచారం ప్రకారం, లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మేఘానీ నగర్ ప్రాంతంలోని డాక్టర్ల హాస్టల్‌పైకి దూసుకెళ్లింది. పోలీసులు, ఇతర ఏజెన్సీలు 2-3 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 70-80 శాతం ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అన్ని ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు.

  • 12 Jun 2025 03:27 PM (IST)

    5 నిమిషాల్లోనే కూలిపోయిన విమానం: DGCA

    అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోయిందని డీజీసీఏ తెలిపింది. అహ్మదాబాద్ విమానాశ్రయంలోని అన్ని విమానాలు రద్దు చేశారు. విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు.

  • 12 Jun 2025 03:22 PM (IST)

    సివిల్ హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్

    సివిల్ హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు అధికారులు. మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో ఉన్నారు.

  • 12 Jun 2025 03:19 PM (IST)

    అహ్మదాబాద్ బయలుదేరిన అమిత్ షా

    అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం వెలుపల కూలిపోయింది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. వెంటనే అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు అమిత్ షా.

  • 12 Jun 2025 03:16 PM (IST)

    శక్తి మేరకు సహాయం అందిస్తున్నాంః ఎయిర్ ఇండియా

    అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 171 కూలిపోయిందని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. ఈ వినాశకరమైన సంఘటనలో ప్రభావితమైన వారందరి కుటుంబాలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఈ సమయంలో ప్రాథమిక దృష్టి బాధిత వారందరినీ, వారి కుటుంబాలను ఆదుకోవడం. అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయం చేయడానికి, బాధిత వారికి అవసరమైన అన్ని సహాయం, సంరక్షణను అందించడానికి, శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నామని ఎయింర్ ఇండియా తెలిపింద. అత్యవసర కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చి, సమాచారం కోరుకునే కుటుంబాల కోసం సహాయక బృందాలను ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.

  • 12 Jun 2025 03:11 PM (IST)

    సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత

    సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం వెలుపల కూలిపోయింది. దీంతో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయానికి ప్రయాణించే ముందు తాజా అప్‌డేట్స్ కోసం ప్రయాణీకులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.

  • 12 Jun 2025 03:07 PM (IST)

    ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

    హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. విమాన ప్రమాదం తర్వాత బాధితులకు సాధ్యమైనంత సహాయం అందేలా చూడాలన్నారు. అహ్మదాబాద్ వెళ్లి సహాయం అందించాలని ఆయన ఇద్దరు మంత్రులను కోరారు.

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీశారు. “రక్షణ, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు అహ్మదాబాద్ వెళ్తున్నారని ప్రధానమంత్రికి సమాచారం అందింది. అవసరమైన అన్ని సహాయాలను వెంటనే అందించాలని, పరిస్థితి గురించి క్రమం తప్పకుండా సమాచారం అందించాలని ప్రధానమంత్రి మంత్రిని ఆదేశించారు” అని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • 12 Jun 2025 03:06 PM (IST)

    సహాయక చర్యలు ముమ్మరం

    అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గ్రీన్ కారిడార్‌ను రూపొందిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

  • 12 Jun 2025 03:04 PM (IST)

    పలు విమానాలు రద్దు!

    ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో అహ్మదాబాద్ విమానాశ్రయ రన్‌వే మూసి వేశారు. దీంతో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన 4 ఇండిగో, 5 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి.

  • 12 Jun 2025 02:57 PM (IST)

    విమాన ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి

    విమాన ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి షాక్‌కు గురయ్యానని కేంద్ర మంత్రి తెలిపారు. వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

  • 12 Jun 2025 02:49 PM (IST)

    విమానంలో 242 మంది

    కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానానికి కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నాయకత్వం వహించారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ఉన్నారని DGCA తెలిపింది.

  • 12 Jun 2025 02:47 PM (IST)

    ఫైలట్ ఎవరు..? అతని అనుభవం ఎంత?

    విమాన కెప్టెన్ సుమిత్ సభర్వాల్ 8200 గంటల LTC అనుభవం ఉంది. కో-పైలట్‌కు 1100 గంటల విమానయాన అనుభవం ఉంది. TC ప్రకారం, విమానం అహ్మదాబాద్ నుండి 1339 IST (0809 UTC)కి రన్‌వే 23 నుండి బయలుదేరింది. రన్‌వే 23 నుండి టేకాఫ్ అయిన వెంటనే, విమానం విమానాశ్రయ వెలుపల నేలపై కూలిపోయింది. ప్రమాద స్థలం నుండి భారీ నల్లటి పొగ వెలువడటం కనిపించింది” అని DGCA తెలిపింది.

  • 12 Jun 2025 02:45 PM (IST)

    ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన

    ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన వెలువడింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ వెళ్తున్న AI171 విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం, ఈ సంఘటన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా http://airindia.com , సోషల్ మీడియా X హ్యాండిల్ వేదికగా మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపింది.

  • 12 Jun 2025 02:44 PM (IST)

    ఘటనాస్థలానికి సీఎం భూపేంద్ర

    ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూరత్ నుండి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు.  యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయ చర్యలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూచనలు ఇచ్చారు. గాయపడిన ప్రయాణీకులకు తక్షణ చికిత్స అందించాలని కూడా ఆయన కోరారు.

  • 12 Jun 2025 02:42 PM (IST)

    ప్రమాదస్థలికి చేరుకుంటున్న సహాయక బృందాలు

    గాంధీనగర్ నుండి 90 మంది సిబ్బందితో కూడిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) యొక్క 3 బృందాలను విమానం కూలిపోయిన ప్రదేశానికి పంపారు. వడోదర నుండి మొత్తం 3 బృందాలను పంపుతున్నారు.

  • 12 Jun 2025 02:41 PM (IST)

    విమానంలో గుజరాత్ మాజీ సీఎం

    అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.

  • 12 Jun 2025 02:40 PM (IST)

    ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు

    గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12) భారీ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. అన్ని విమానాశ్రయ మార్గాలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

Published On - Jun 12,2025 2:36 PM