Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Filght: విమానం గాల్లో ఉండగా శ్వాస తీసుకోవడం ఆపేసిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

ఇటీవల విమానంలో కొన్ని వికృత చేష్టల ఘటనలు దేశవ్యాప్తంగా దుమారం లేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ విమాన ప్రయాణంలో అనూహ్య సంఘటన జరిగింది. ఊపిరి ఆగిపోయిన పరిస్థితిలో ఉన్న ఓ రెండేళ్ల చిన్నారని ఒక వైద్య బృందం కాపాడింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విస్తార అనే సంస్థకు చెందిన యూకే 814 విమానంలో ఆదివారం రోజున ఈ ఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటో ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే యూకే 814 విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళుతోంది.

Filght: విమానం గాల్లో ఉండగా శ్వాస తీసుకోవడం ఆపేసిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?
Vistara Flight
Follow us
Aravind B

|

Updated on: Aug 28, 2023 | 2:22 PM

ఇటీవల విమానంలో కొన్ని వికృత చేష్టల ఘటనలు దేశవ్యాప్తంగా దుమారం లేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ విమాన ప్రయాణంలో అనూహ్య సంఘటన జరిగింది. ఊపిరి ఆగిపోయిన పరిస్థితిలో ఉన్న ఓ రెండేళ్ల చిన్నారని ఒక వైద్య బృందం కాపాడింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విస్తార అనే సంస్థకు చెందిన యూకే 814 విమానంలో ఆదివారం రోజున ఈ ఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటో ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే యూకే 814 విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళుతోంది. అయితే ఇందులో వెళ్తున్న ప్రయాణికుల్లో ఓ కుటుంబం గుండె సమస్యతో బాధపడుతున్నటువంటి తమ రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. బెంగళూరు నుంచి ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ చిన్నారి శ్వాస తీసుకోవడం ఆపేసింది.

అంతేకాదు ఆ చిన్నారి పెదాలు, వేళ్లు కూడా నీలిరంగులోకి మారిపోయాయి. అలాగే నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోయింది. సమాచారం తెలుసుకున్న విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటవే విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పూర్ వైపుకు మళ్లించారు. అయితే ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సదస్సుకు హాజరై.. అదే విమానంలో తిరిగి వస్తున్న ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ఒక వైద్య బృందం చిన్నారి సమస్యను తెలుసుకుంది. ఇక వెంటనే ఆ పాపను రక్షించేందుకు వారు ముందుకు వచ్చారు. వాస్తవానికి ఆ చిన్నారికి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. దీంతో ఆ వైద్యులు ముందుగా ఆ చిన్నారి శ్వాస తీసుకునేందుకు వీలుగా ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. అలాగే సీపీఆర్ కూడా చేయడంతో ఆ పాప తిరిగి ఊపిరి పీల్చుకుంది. ఆ చిన్నారిని కాపాడేందుకు దాదాపు 45 నిమిషాల పాటు వైద్యులు తీవ్రంగా శ్రమించారు.

ఇవి కూడా చదవండి

వారు చేసిన ప్రథమ చికిత్స ద్వారా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ పాపను ఆసుపత్రికి తరలించారు. అయితే విమానంలో జరిగిన ఘటనతో పాటు చిన్నారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..