Ahmedabad-plane-crash: ట్రాఫిక్ జామ్ ఆమె ప్రాణాల్ని నిలబెట్టింది..
భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ఎయిరిండియా విమానం AI171ను మిస్ అవ్వడం వల్ల తన ప్రాణాలు కాపాడుకుంది. జూన్ 12న జరిగిన ఈ విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోగా, ట్రాఫిక్ కారణంగా పది నిమిషాల ఆలస్యంగా భూమి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో విమానం ఎక్కలేదు.

మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆలస్యం మంచికీ.. మరికొన్ని చెడుకీ కారణం అవుతుంది. తాజాగా ఆలస్యం ఓ యువతి ప్రాణం నిలబెట్టింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను కాపాడింది.
భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా ఫ్లైట్ AI171 బుక్ చేసుకుంది. అయితే ఎయిర్‌పోర్టుకు చేరుకునే క్రమంలో ట్రాఫిక్ జామ్ కారణంగా పది నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఈ ఆలస్యం వల్ల ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పటికి ఆమె ఎయిర్‌పోర్ట్ చేరుకోలేదు. అయితే విమానం టేకాఫ్ చేసిన క్షణాల్లోనే ప్రమాదానికి గురై సమీపంలోని నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 241 మంది దుర్మరణం చెందారు. విమానం మెడికల్ కాలేజ్‌పై కూలడంతో అక్కడ ఉన్నే 24 మంది కూడా మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది.
ప్రమాదం జరిగిన వార్త వినగానే భూమి ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. “దేవుడే నన్ను రక్షించాడు. ఆ పది నిమిషాల ఆలస్యం లేకపోతే నేను కూడా ఆ విమానంలో ఉండేవాడిని,” అంటూ ఆమె భావోద్వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భూమి లండన్‌లో తన భర్తతో కలిసి నివసిస్తోంది. రెండు సంవత్సరాల తర్వాత వేకేషన్ కోసం ఇండియాకు వచ్చింది. ఒక చిన్న ఆలస్యం భూమి చౌహాన్ జీవితాన్ని కాపాడింది. కానీ ఈ విషాద ఘటన ఎన్నో కుటుంబాలను చీకటిలోకి నెట్టింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




