Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రమాద మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించిన గుజరాత్.. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారంటే?

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై గుజరాత్‌ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మరణించిన మృతుల సంఖ్యను తాజాగా ప్రకటిచింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 275 మంది వరకు మరణించినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. 256 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపింది.

విమాన ప్రమాద మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించిన గుజరాత్.. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారంటే?
Air India Ai171 Crash
Anand T
|

Updated on: Jun 24, 2025 | 10:44 PM

Share

గుజరాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్‌ భారత దేశాన్ని కలిచివేసింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌ వేళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 242 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిరిండియా AI 171, డ్రీమ్‌లైనర్‌ విమానం రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే ఎయిర్‌పోర్టు సమీపంలోని మెడికల్‌ కాలేజ్‌ బిల్డింగ్‌ను ఢీకొట్టి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులతో పాటు మెడికల్‌ కాలేజ్‌లోని 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందిన మృతు సంఖ్య  275కు చేరినట్టు గుజరాత్‌ ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.

డీఎన్ఏ పరీక్షల చేయడం ద్వారా 260 మంది మృతులను గుర్తించగా… వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు సహాయక చర్యలు చేపట్టి వెలికి తీసిన మృతదేహాలలో 256 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వివరించారు.

అయితే ఈ ప్రామదంలో ప్రయాణించిన ప్రయాణికుల్లో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ సహా మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోగా.. కేవలం 11ఏ సీటులో ఉన్న రమేష్‌ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో