AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు ATCకి MAYDAY కాల్.. ఇంతకు ఈ MAYDAY కాల్ అంటే ఏమిటో తెలుసా?

గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా AI171 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. అయితే ఈ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి MAYDAY కాల్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత ATC విమానానికి చేసిన కాల్‌లకు ఎటువంటి స్పందన ఇవ్వలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు మేడే కాల్ అంటే ఏమిటి దీన్ని ఎందుకు ఉపయోడిస్తారో తెలుసుకుందాం పదండి..

విమాన ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు ATCకి MAYDAY కాల్.. ఇంతకు ఈ MAYDAY కాల్ అంటే ఏమిటో తెలుసా?
Mayday Call
Anand T
|

Updated on: Jun 12, 2025 | 5:15 PM

Share

242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా AI171 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ విమానం ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలోని ఓ బిడ్జింగ్‌ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిడ్జింగ్‌లో ఉన్న 20 మంది మరణించారు. అయితే విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా వెలువడ లేదు. అయితే లండన్‌కు బయల్దేరిన ఈ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి MAYDAY కాల్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత ATC విమానానికి చేసిన కాల్‌లకు ఎటువంటి స్పందన ఇవ్వలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే విమానం ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు ATCకి వచ్చిన ఈ MAYDAY కాల్ ఏమిటి? దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే. విమానయాన పరిభాషలో MAYDAY కాల్ అనేది అత్యవసర పరిస్థితులో ఉపయోగించే ఒక సంకేతం, ఇది సాధారణంగా విమానాలు, ఓడలు లేదా ఇతర వాహనాల్లో తీవ్రమైన ప్రమాదం లేదా జీవనాశన స్థితిలో సహాయం కోరడానికి ఉపయోగిస్తారు. ఈ మేడే అనేది ఫ్రెంచ్ పదం “m’aider” (మాయిడే) నుండి ఇది ఉద్బవించింది, దీని అర్థం “నాకు సహాయం చేయండి” అని. MAYDAY కాల్ సాధారణంగా ATCకి లేదా సమీపంలోని ఇతర విమానాలకు రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితిని తెలియజేయడానికి, సకాలంలో సహాయక చర్యలు కొరడానికి ఈ సిగ్నల్ ఉపయోగించబడుతుంది.

ఇంజిన్ వైఫల్యాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, నిర్మాణాత్మక లోపాలు లేదా విమానంలో వైద్య అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాలలో MAYDAY కాల్ ఉపయోగించబడుతుంది. మేడే కాల్‌ను రేడియో కమ్యూనికేషన్ ద్వారా మూడు సార్లు “మేడే, మేడే, మేడే” అని పునరావృతం చేస్తూ ప్రసారం చేస్తారు, ఆ తర్వాత సమస్య యొక్క వివరాలు, స్థానం తెలియజేస్తారు. MAYDAY కాల్ అందుకున్న తర్వాత, ATC, ఇతర సంబంధిత అధికారులు రెస్క్యూ ప్రయత్నాల సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తారు. బాధిత విమానం లేదా నౌకలకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు.

నోట్‌: మేడే సిగ్నల్ అత్యంత ప్రాధాన్యత కలిగిన అత్యవసర సంకేతం, దీనిని స్వీకరించిన వెంటనే సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంకేతం, దీనిని తప్పుగా ఉపయోగించడం చట్టవిరుద్ధం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..