AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రమాదం.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్!

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది. 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

విమాన ప్రమాదం.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్!
Tata Group Chairman Chandra
SN Pasha
|

Updated on: Jun 12, 2025 | 7:42 PM

Share

యావత్‌ దేశం ఉలిక్కిపడేలా ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిపోయింది. లండన్‌కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం.. విమానంలో 241 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో ఉంది. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారికి టాటా గ్రూప్ భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అలాగే విమాన ప్రమాద సమయంలో దెబ్బ తిన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ ను కూడా పునర్మిస్తామని కూడా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..