ఆకాశవీధిలో మృత్యునాదం.. అత్యంత విషాదాన్ని నింపిన ప్రమాదాలు ఇవే!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. భారతదేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 254మందితో లండన్‌కు పయనమైన విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఉదంతంతో... గత ప్రమాదాలను కూడా నెమరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందు భారత్‌లో జరిగిన భారీ విమానప్రమాదాలేంటి? ఎక్కడెక్కడ జరిగాయ్! ఆ వివరాలు చూద్దాం.

1908 సెప్టెంబర్ 17. ప్రపంచంలోనే మొదటి విమాన ప్రమాదం జరిగిన రోజు అది. అప్పటి నుంచి అహ్మదాబాద్ ఘటన వరకు వందల విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 1970 నుంచి చూస్తే.. ఇప్పటి వరకు 11వేల 164 విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల కారణంగా 83వేల 772 మంది చనిపోయారు. పర్టిక్యులర్‌గా 1970 నుంచే ఎందుకు తీసుకోవాలంటే.. 200 కంటే ఎక్కువ మంది మరణించిన విమాన ప్రమాదాలు జరిగింది 1970 తరువాతే కాబట్టి. 1974 మార్చి 3న టర్కిష్ ఎయిర్‌లైన్స్ యాక్సిడెంట్‌లో 346 మంది మరణించారు. లేటెస్ట్‌గా జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటనలో 241 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఆకాశవీధిలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల గురించి, మరీ ముఖ్యంగా ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా విమానంలోని లోపాల గురించి డిటైల్డ్‌గా చూద్దాం. భారత విమానయాన హిస్టరీలో మరో పెనుప్రమాదం చేరింది. అహ్మదాబాద్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం AI 171… టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. 12మంది సిబ్బంది, 242మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం… ఎయిర్‌పోర్టు దాటిని కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కూలిపోయింది. చెట్టుకు ఢీకొని కింద పడటంతో.. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారత్‌లో ఇలాంటి విమాన ప్రమాదాలు గతంలోనూ జరిగాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం.. అంటే 2020లో కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్...