Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రమాదంలో స్టార్‌ హీరో బంధువు మృతి! అతనే కో-పైలెట్‌ కూడా..

గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోయి 241 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఒకరు మాత్రమే బయటపడ్డారు. మృతుల లో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బంధువు కూడా ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

విమాన ప్రమాదంలో స్టార్‌ హీరో బంధువు మృతి! అతనే కో-పైలెట్‌ కూడా..
Copilot Kunder
SN Pasha
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 13, 2025 | 12:21 PM

Share

దేశం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసే ఘటన గురువారం చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంతా విమానంలో ఉన్నవాళ్లు అయితే.. విమానం కూలిన బిల్డింగ్‌లోని మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మృత్యువాత పడ్డారు. మొత్తం 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. ఇందులో 229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది విమాన సిబ్బంది మరణించారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు 11ఏ సీట్‌లో కూర్చున్న రమేష్‌ అనే ప్రయాణికుడు మాత్రమే అదృష్టం కొద్ది బయటపడ్డాడు.

అయితే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన కో పైలెట్‌ క్లైవ్‌ కుందర్‌ ఓ బాలీవుడ్‌ హీరోకు బంధువు అవుతాడు. క్లైవ్ కుందర్ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బంధువు అని తెలిసింది. దీనిని విక్రాంత్ మాస్సే స్వయంగా ధృవీకరించారు. ’12వ ఫెయిల్’ సినిమాతో ఫేమ్‌ పొందిన విక్రాంత్ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తన బంధువు క్లైవ్ కుందర్ మరణం పట్ల ఆయన బాధను తెలియజేశారు.

“అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు, ప్రియమైనవారి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. నా మామ క్లిఫోర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ కూడా చనిపోయాడని తెలిసి మరింత బాధగా ఉంది. ఆ విమానంలో ఫస్ట్‌ ఆఫీసర్‌ క్లైవ్ కుందర్” అని విక్రాంత్ మాసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. విమాన ప్రమాదం తర్వాత చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు స్పందించారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, యష్, అల్లు అర్జున్, రష్మిక మందన్న, రమ్య, అక్షయ్ కుమార్, అలియా భట్, కంగనా రనౌత్, సోను సూద్, రణవీర్ సింగ్ అనేక మంది తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దాని కోసమే వేయిటింగ్.. మీనాక్షి చౌదరి చిన్ని కోరిక ఏంటో తెలుసా?
దాని కోసమే వేయిటింగ్.. మీనాక్షి చౌదరి చిన్ని కోరిక ఏంటో తెలుసా?
ఫిజీలో శివాలయంపై దాడి.. 100 ఏళ్ల నాటి విగ్రహాల ధ్వంసం..
ఫిజీలో శివాలయంపై దాడి.. 100 ఏళ్ల నాటి విగ్రహాల ధ్వంసం..
రక్తం తాగే పిశాచిలా మారిపోయిన క్రేజీ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
రక్తం తాగే పిశాచిలా మారిపోయిన క్రేజీ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!
మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే