ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీ మిత్రపక్షం ఒక్కటే
కేంద్ర మంత్రి, ఎల్ జె పీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ మృతి అనంతరం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీకి ఉన్న మిత్ర పక్షం రామ్ దాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కటే. మోదీ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శివసేన..

కేంద్ర మంత్రి, ఎల్ జె పీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ మృతి అనంతరం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీకి ఉన్న మిత్ర పక్షం రామ్ దాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కటే. మోదీ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శివసేన, శిరోమణి అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీ కేంద్ర కేబినెట్ లో భాగస్వామ్య పార్టీలుగా ఉండేవి. కానీ 2019 చివరలో శివసేన ఎన్డీయే కూటమి నుంచి వైదొలగగా, రైతు చట్టాలకు నిరసనగా శిరోమణి అకాలీదళ్ ఇటీవలే తప్పుకుంది. ఇక మిత్ర పక్షమైన జేడీ-యూ కూడా మెల్లగా దూరమైంది.



