Farmers Protest: రైతు సంఘాల కీలక నిర్ణయం.. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటన..
Farmers removing tents: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిసహద్దుల్లో ఏడాదికిపైగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో
Farmers removing tents: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిసహద్దుల్లో ఏడాదికిపైగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 19న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న ప్రకటించారు. దీంతోపాటు శీతాకాల సమావేశాలు తొలిరోజున లోక్‌సభలో, రాజ్యసభలో వ్యవసాయ చట్టాల రద్దుపై తీర్మానం కూడా జరిగింది. అయితే.. పంటల కనీస మద్దతు ధరపై స్పష్టతనివ్వాలని.. కేసులు ఉపసంహరించుకోవాలని.. ఉద్యమంలో మరణించిన వారికి పరిహారం చెల్లించాలన్న డిమాండ్లతో రైతు సంఘాలు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. వీటిపై కూడా సానుకూలంగా స్పందిస్తామని ఎంఎస్పీ ధరపై కమిటీ వేస్తామని, ఆందోళన విరమించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. రెండ్రోజుల్లో ధర్నా ప్రాంతాలన్నింటిని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు గురువారం వెల్లడించారు. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించడంతో గత 15 మాసాలుగా చేస్తున్న ఆందోళన విరమిస్తునట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే.. తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీ శివార్లలోని సింఘు, ఘాజీపూర్లో ఏడాది నుంచి ఆందోళన చేస్తున్న రైతులు తమ టెంట్లను తొలగిస్తున్నారు.
ఈ క్రమంలో రైతు సంఘం నేత.. రాకేశ్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు విరమించడం లేదని.. వాయిదా మాత్రమే వేస్తున్నామని రైతు సంఘాల అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ వెల్లడించారు. అయితే డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో కొనసాగిస్తామని స్పష్టంచేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సైనికుల కుటుంబాలను పరామర్శిస్తామని టికాయత్ వెల్లడించారు. దీంతోపాటు జనవరి 11న మరోసారి సమావేశం కావాలని కూడా రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో 378 రోజుల పాటు ఢిల్లీలో కొనసాగిన రైతు ఆందోళనకు బ్రేక్ పడింది.
Farmers start removing tents from their protest site in Singhu on Delhi-Haryana
“We are preparing to leave for our homes, but the final decision will be taken by Samyukt Kisan Morcha,” a farmer says pic.twitter.com/rzRjPkPfE1
— ANI (@ANI) December 9, 2021
కాగా.. కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆతర్వాత రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామమని వెల్లడించింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతు సంఘాలు సమావేశమై ఢిల్లీ సరిహద్దుల్ని ఖాళీ చేసేందుకు నిర్ణయించాయి.
Also Read: