AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Cards: మీ పేరు మీద ఎక్కువ సిమ్‌ కార్డులున్నాయా.. చర్యలకు సిద్ధమైన టెలికాం శాఖ.. ఎప్పటినుంచంటే?

TRAI: దేశవ్యాప్తంగా 9 కనెక్షన్లు, జమ్మూ కాశ్మీర్, అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రంలో 6 కనెక్షన్లు ఉన్న కస్టమర్ల సిమ్‌లను మరోసారి ధృవీకరించాలని పేర్కొంది.

SIM Cards: మీ పేరు మీద ఎక్కువ సిమ్‌ కార్డులున్నాయా.. చర్యలకు సిద్ధమైన టెలికాం శాఖ.. ఎప్పటినుంచంటే?
Sim Cards
Venkata Chari
|

Updated on: Dec 09, 2021 | 1:42 PM

Share

Telecom Regulatory Authority of India: 9 కంటే ఎక్కువ సిమ్‌లు కలిగి ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని టెలికాం శాఖ ఆదేశించింది. దేశవ్యాప్తంగా 9 కనెక్షన్లు, జమ్మూ కాశ్మీర్, అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రంలో 6 కనెక్షన్లు ఉన్న కస్టమర్ల సిమ్‌లను మరోసారి ధృవీకరించాలని పేర్కొంది. ఒకవేళ ధృవీకరించబడకపోతే వాటిని డిస్‌కనెక్ట్ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు డిసెంబర్ 7న ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మీ పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉంటే ఏమి చేయాలి? టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, వినియోగదారులు అనుమతించిన దానికంటే ఎక్కువ సిమ్ కార్డులను కలిగి ఉన్నట్లయితే, వారు తమకు నచ్చిన సిమ్‌ను ఉంచుకుని, మిగిలిన వాటిని స్విచ్ ఆఫ్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు. ఖాతాదారుడి వద్ద నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ సిమ్ కార్డులు దొరికితే, అన్ని సిమ్‌లను మరోసారి ధృవీకరించుకోవాలని డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉన్న వినియోగదారులకు నోటిఫికేషన్లు పంపాలని సిమ్ విభాగం అన్ని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. అటువంటి సిమ్ కార్డ్‌లకు అన్ని అవుట్‌గోయింగ్ కాల్‌లను 30 రోజుల్లోగా ముగించాలి. అయితే ఇన్‌కమింగ్ కాల్‌లను 45 రోజుల్లోగా మూగించాలని ఆదేశించింది. అయితే, మొబైల్ సిమ్ వినియోగదారులు అదనపు సిమ్‌ను సరెండర్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

నోటిఫై చేసిన సిమ్‌ను సబ్‌స్క్రైబర్ ధృవీకరించకపోతే, అటువంటి సిమ్‌ను 60 రోజుల్లోగా నిలిపివేయాలని ఆదేశించారు. నేర సంఘటనల దర్యాప్తునకు తీసుకున్న చర్యలు ఆర్థిక నేరాలు, అభ్యంతరకరమైన కాల్‌లు, మోసపూరిత కార్యకలాపాలపై దర్యాప్తు చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ చర్య తీసుకుంది. నిబంధనల ప్రకారం ఉపయోగంలో లేని మొబైల్ నంబర్‌లన్నింటినీ డేటాబేస్ నుంచి తొలగించాలని టెలికాం కంపెనీలను డిపార్ట్‌మెంట్ కోరింది.

సిమ్ కోసం కేవైసీ అవసరం.. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లోనే, ప్రభుత్వం సిమ్ కార్డ్ కేవైసీ నిబంధనలను మార్చింది. దీని ప్రకారం, కొత్త కనెక్షన్ పొందడానికి లేదా ప్రీపెయిడ్ నంబర్‌ను పోస్ట్‌పెయిడ్‌గా లేదా పోస్ట్‌పెయిడ్‌ను ప్రీపెయిడ్‌గా మార్చడానికి ఫిజికల్ ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేకుండా పోయింది.

మీరు కొత్త మొబైల్ నంబర్ లేదా టెలిఫోన్ కనెక్షన్ పొందవలసి వస్తే, మీ కేవైసీ పూర్తిగా డిజిటల్ అవుతుంది. అంటే మీరు కేవైసీ కోసం ఎలాంటి పేపర్‌ను సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనల ప్రకారం, మీరు సిమ్ ప్రొవైడర్ యాప్ ద్వారా స్వీయ-కేవైసీ చేయగలుగుతారు. దీని కోసం మీరు కేవలం రూ.1 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Large Cap Stocks: తక్కువ ధరలో బెస్ట్ స్టాక్స్.. పెట్టుబడికి మంచి అవకాశం.. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్‌పై ఓ కన్నేయండి..!

Block ATM Card: మీ బ్యాంకు ఏటీఎం కార్డు ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేయాలని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!