Large Cap Stocks: తక్కువ ధరలో బెస్ట్ స్టాక్స్.. పెట్టుబడికి మంచి అవకాశం.. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్‌పై ఓ కన్నేయండి..!

వెయ్యి రూపాయల లోపు ధరతో ట్రేడవుతున్న ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ స్టాక్ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. ఇవన్నీ పెద్ద కంపెనీలకు చెందిన మంచి పనితీరు చూపించిన స్టాక్స్.

Large Cap Stocks: తక్కువ ధరలో బెస్ట్ స్టాక్స్.. పెట్టుబడికి మంచి అవకాశం.. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్‌పై ఓ కన్నేయండి..!
Multibagger Stocks
Follow us

|

Updated on: Dec 09, 2021 | 12:42 PM

Large Cap Stocks: వెయ్యి రూపాయల లోపు ధరతో ట్రేడవుతున్న ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ స్టాక్ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. ఇవన్నీ పెద్ద కంపెనీలకు చెందిన మంచి పనితీరు చూపించిన స్టాక్స్. రెండు రోజులుగా మార్కెట్‌లో భారీ ర్యాలీ జరుగుతోంది. అయితే, స్టాక్ దాని ఆల్ టైమ్ హై కంటే చాలా తక్కువగా ఉంది. అక్టోబర్‌లో సెన్సెక్స్ 62 వేల మార్క్‌ను దాటింది. మంగళ, బుధవారాల్లో దాదాపు 1900 పాయింట్ల మేర పెరిగింది. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెరుగుదల ఉంది. కానీ, ఇప్పటికీ అవి చాలా తక్కువ ధరలలో ట్రేడ్ అవుతున్నాయి.

గోద్రెజ్ కన్స్యూమర్ ధర రూ. 900 రూ.1000 కంటే తక్కువ ధర ఉన్న లార్జ్ క్యాప్ షేర్లలో గోద్రెజ్ కన్స్యూమర్ షేర్ రూ.900 వద్ద ట్రేడవుతోంది. ఫిబ్రవరిలో రూ.644 ఉండగా సెప్టెంబర్‌లో రూ.1138కి చేరింది. ఫార్మా కంపెనీ సిప్లా గురించి చెప్పాలంటే, దాని స్టాక్ ప్రస్తుతం రూ. 896 వద్ద ఉంది. సెప్టెంబర్‌లో రూ.1,005గా ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ కూడా రూ.840 వద్ద ఉంది. గత నెలలో ఈ షేరు రూ.978కి చేరింది.

వెయ్యి రూపాయాల లోపే IRCTC షేర్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న IRCTC షేర్ కూడా ఇప్పుడు వెయ్యి రూపాయల లోపే ఉంది. IPOతో పోలిస్తే ఇది పెట్టుబడిదారులకు గణనీయమైన ప్రయోజనాన్ని అందించింది. దీని స్టాక్ ప్రస్తుతం రూ.853 వద్ద ఉంది. నవంబర్‌లో రూ.1,278కి చేరుకుంది. టాటా కన్స్యూమర్ షేర్ ప్రస్తుతం రూ.772 వద్ద ఉండగా, సెప్టెంబర్‌లో రూ.889 స్థాయిని తాకింది.

అదానీ గ్రూప్ కంపెనీ కూడా.. బెర్జర్ పెయింట్స్ దాని రంగంలో అత్యుత్తమ కంపెనీ. దీని షేరు రూ.747 వద్ద ఉండగా, జూలైలో రూ.872కి చేరింది. అదానీ గ్రూపునకు చెందిన పోర్ట్ కంపెనీ షేరు ప్రస్తుతం రూ.763గా ఉంది. జూన్‌లో రూ.901 స్థాయిని తాకింది. ప్రైవేట్ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికీ రూ.753 వద్ద ట్రేడవుతోంది. అక్టోబర్‌లో రూ.859కి చేరింది.

ఈ స్టాక్ వెయ్యి రూపాయాలు దాటుతుందని బ్రోకరేజీ సంస్థలు నమ్ముతున్నాయి. ఈ ఏడాది ఈ బ్యాంక్ స్టాక్ దాదాపు 45 శాతం లాభపడింది. దేశంలోని అగ్రశ్రేణి ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ షేర్లు రూ. 1500 పైన ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ షేరు ఇప్పటికీ రూ.690 వరకు ఉంది. ఇది కూడా లార్జ్ క్యాప్ స్టాక్. రూ.800 స్థాయిని దాటింది.

దీంతో పాటు జేఎస్‌డబ్ల్యూ ధర రూ.673గా ఉండగా, విప్రో, మారికో వంటి కంపెనీల షేర్లు కూడా రూ.700లోపే ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ స్టాక్ రూ.491 వద్ద ఉండగా, గత నెలలో రూ.543 వద్ద ట్రేడయింది.

Also Read: Block ATM Card: మీ బ్యాంకు ఏటీఎం కార్డు ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేయాలని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

Pension Scheme: ఈ పథకంలో చేరితే నెలకు రూ.3 వేల పెన్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు..!