Hyundai: హ్యుందాయ్ నుంచి ఎలక్ట్రిక్ కార్లు.. చెన్నైలో వాహనాల తయారీ ప్లాంట్..!
Hyundai: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాయి. ఇక తాజాగా హ్యుందాయ్ ఇండియాలో ఎలక్ట్రిక్..
Hyundai: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాయి. ఇక తాజాగా హ్యుందాయ్ ఇండియాలో ఎలక్ట్రిక్ రైడ్‌కు రెడీ అవుతోంది. 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
1 / 4
వీటిలో ఒక మోడల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల ఆధారంగా అలాగే అంతర్జాతీయంగా కంపెనీ అమలు చేస్తున్న ఈ-జీఎంపీ ప్లాట్‌ఫాంపైనా కొన్ని మోడళ్లను తయారు చేస్తోంది.
2 / 4
ఈ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు హ్యుండాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది.
3 / 4
ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్‌ను చెన్నైలో ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. బ్యాటరీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు వెల్లడించింది.